గుండూర్ నుంచి మహారాష్ట్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రం మన్మథ స్వామి (కపిల్దార్ )దర్శనార్థం కొరకు పాదయాత్ర
గుండూర్ నుంచి మహారాష్ట్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రం మన్మథ స్వామి (కపిల్దార్ )దర్శనార్థం కొరకు పాదయాత్ర మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి నవంబర్ 13 కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని గుండుర్ గ్రామం నుండి మహారాష్ట్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రం మన్మథ స్వామి కపిల్దార్ దర్శనార్థం భక్తులు భక్తిశ్రద్ధలతో పాదయాత్రగా బయలుదేరారు. స్వామివారి ఆశీస్సులు గ్రామ ప్రజలందరిపై ఉండాలని, గ్రామం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ భక్తులు ఈ పాదయాత్రను చేపట్టారు. వచ్చే కార్తీక పౌర్ణమి నాటికి పాదయాత్ర మన్మద్ స్వామి కి చేరుకుంటుంది...