📄 ePaper
5pm
7pm
Saturday, November 21, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణహైకోర్టులో కొలిపాక శ్రీనివాస్‌కు భారీ ఊరట

హైకోర్టులో కొలిపాక శ్రీనివాస్‌కు భారీ ఊరట

📰 Generate e-Paper Clip

హైకోర్టులో కొలిపాక శ్రీనివాస్‌కు భారీ ఊరట

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును కొట్టివేసిన ఉన్నత న్యాయస్థానం

కేసులతో భయపెట్టలేరు.. బెదిరింపులతో గొంతు నొక్కలేరు.. బీసీల హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తాం

ప్రజావాణి జిల్లా ప్రతినిధి
పెద్దపల్లి నవంబర్ 12

పెద్దపల్లి: బీసీ నాయకుడు కొలిపాక శ్రీనివాస్‌కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనపై నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును హైకోర్టు కొట్టివేసినట్లు సమాచారం. ఈ పరిణామంతో కొలిపాక శ్రీనివాస్‌కు న్యాయపరంగా ఉపశమనం లభించినట్లయింది.

బీసీల హక్కుల సాధనతో పాటు ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతున్న తనను కేసులతో భయపెట్టి ఉద్యమం నుంచి దూరం చేయలేరని ఆయన మద్దతుదారులు పేర్కొంటున్నారు. న్యాయం కోసం, బీసీల ఆత్మగౌరవం కోసం సాగిస్తున్న పోరాటానికి ఈ పరిణామం మరింత బలాన్నిస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు.

ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుకలను అణచివేయాలని ప్రయత్నించినంత మాత్రాన ఉద్యమాలను ఆపలేరని, ఎన్ని ఆటంకాలు ఎదురైనా ప్రజల పక్షాన నిలబడి పోరాటం కొనసాగిస్తామని ఆయన అనుచరులు స్పష్టం చేస్తున్నారు.

బీసీలకు రాజ్యాంగబద్ధంగా దక్కాల్సిన హక్కులు, సామాజిక న్యాయం, ఆత్మగౌరవం సాధించే వరకు తమ పోరాటం ఆగదని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టు తీర్పు కొలిపాక శ్రీనివాస్‌కు కొత్త ఉత్సాహాన్నిచ్చిందని, భవిష్యత్తులో ప్రజా సమస్యలపై మరింత చురుగ్గా పోరాడుతారని మద్దతుదారులు పేర్కొంటున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.