📄 ePaper
Epaper 2
Thursday, November 12, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణశాస్త్ర సాంకేతిక రంగాల్లో ఉన్నత అవకాశాలను అందిపుచ్చుకోవాలి – ప్రొఫెసర్ పి. రామచంద్రారెడ్డి

శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఉన్నత అవకాశాలను అందిపుచ్చుకోవాలి – ప్రొఫెసర్ పి. రామచంద్రారెడ్డి

📰 Generate e-Paper Clip

కడప : ప్రజావాణి నవంబర్ (12)

శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఉన్నత అవకాశాలను అందిపుచ్చుకోవాలి – ప్రొఫెసర్ పి. రామచంద్రారెడ్డి

ప్రభుత్వ ప్రోత్సాహకాలు, పరిశోధన నిధులను సద్వినియోగం చేసుకోవాలి

ప్రభుత్వ పురుషుల కళాశాలలో DBT స్టార్ కాలేజ్ పథకం ఆధ్వర్యంలో స్టార్ టాక్

కడప, నవంబర్ 12: శాస్త్ర సాంకేతిక రంగాల్లో వస్తున్న ఆధునిక మార్పులను అందిపుచ్చుకోవడంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వివిధ విద్యా ప్రోత్సాహకాలు, స్కాలర్‌షిప్‌లు, ఫెలోషిప్‌లు, పరిశోధన నిధులను సద్వినియోగం చేసుకొని విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలని యోగి వేమన విశ్వవిద్యాలయం బయోకెమిస్ట్రీ విభాగాధిపతి, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ ప్రొఫెసర్ పి. రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు.

గురువారం కడప ప్రభుత్వ పురుషుల కళాశాల (స్వయంప్రతిపత్తి) జంతుశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో DBT స్టార్ కాలేజ్ పథకంలో భాగంగా “Recent Advances in Applied Sciences: Opportunities and Challenges” అనే అంశంపై నిర్వహించిన స్టార్ టాక్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జె. వెంకటలక్ష్మి అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా ప్రొఫెసర్ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులు Earning While Learning పేరుతో తాత్కాలిక సంపాదనకే ప్రాధాన్యమివ్వకుండా ఉన్నత విద్య, పరిశోధన, నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు. ఆర్థిక అవసరాల కోసం పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేయడం తప్పు కాదని, అయితే చిన్నచిన్న ఉద్యోగాలకే పరిమితం కాకుండా ప్రభుత్వం అందిస్తున్న విద్యా, పరిశోధన అవకాశాలను వినియోగించుకోవాలని తెలిపారు.

జాతీయ విద్యా విధానం–2020 (NEP 2020) ద్వారా అందుబాటులోకి వచ్చిన బహుళ విభాగాల విద్య, మల్టిపుల్ ఎంట్రీ–ఎగ్జిట్ విధానం, అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్, నైపుణ్య ఆధారిత కోర్సులు, ఇంటర్న్‌షిప్‌లు, పరిశోధన అవకాశాలను వివరించారు. రాష్ట్ర స్థాయి సిలబస్‌తో పాటు జాతీయ స్థాయి విద్యా కార్యక్రమాలు, కేంద్ర విద్యాసంస్థలు అందిస్తున్న స్కిల్ డెవలప్‌మెంట్ అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు తమ వయస్సు, విద్యాస్థాయి, ఆసక్తులకు అనుగుణంగా డిజిటల్ నైపుణ్యాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, పరిశోధన నైపుణ్యాలను పెంపొందించుకోవాలని తెలిపారు.

డిగ్రీ నుంచి పీహెచ్‌డీ వరకు అందుబాటులో ఉన్న NSP, INSPIRE-SHE, UGC, CSIR-NET-JRF, DBT-JRF, ICMR, DST, ANRF, ICAR వంటి సంస్థలు, పథకాల ద్వారా అర్హతల ఆధారంగా లభించే స్కాలర్‌షిప్‌లు, ఫెలోషిప్‌లు, పరిశోధన నిధులు, శిక్షణ అవకాశాల గురించి అవగాహన కల్పించారు. విద్యార్థులు సంబంధిత నోటిఫికేషన్లను పరిశీలించి అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు.

కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జె. వెంకటలక్ష్మి మాట్లాడుతూ, ఆర్థిక పరిస్థితులు విద్యార్థుల ఉన్నత లక్ష్యాలకు అడ్డంకి కాకూడదని, ప్రభుత్వ ప్రోత్సాహక పథకాలపై సరైన అవగాహన ఉంటే గ్రామీణ ప్రాంత విద్యార్థులు సైతం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించగలరని పేర్కొన్నారు. విద్యార్థులు ఉద్యోగాన్వేషకులుగానే కాకుండా శాస్త్రవేత్తలుగా, పరిశోధకులుగా, ఆవిష్కర్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు.

DBT స్టార్ కాలేజ్ పథకం కోఆర్డినేటర్ డాక్టర్ వై. సావిత్రి మాట్లాడుతూ, DBT అందిస్తున్న వివిధ శిక్షణ, పరిశోధన అవకాశాలను వివరించారు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, ప్రయోగాత్మక నైపుణ్యాలు పెంపొందించేందుకు ఈ పథకం ఎంతో దోహదపడుతుందని తెలిపారు.

కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ జె. వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ, విద్యార్థులకు ఉన్నత విద్య, పరిశోధన అవకాశాలపై అవగాహన కల్పించే ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించిన జంతుశాస్త్ర విభాగాన్ని అభినందించారు. విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని తమ భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో IQAC కోఆర్డినేటర్ డాక్టర్ పి. కల్పన, వృక్షశాస్త్ర అధ్యాపకులు డాక్టర్ పి.వి. కృష్ణారెడ్డి, జంతుశాస్త్ర అధ్యాపకులు డాక్టర్ సి. నరసింహారావు, డాక్టర్ హరిప్రసాద్, డాక్టర్ నవనీశ్వర్ రెడ్డి, ఇతర అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.