📄 ePaper
5pm
7pm
Saturday, November 21, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణప్రభుత్వ కళాశాల బాలుర వసతి గృహ విద్యార్థులకు దోమతెరల పంపిణీ

ప్రభుత్వ కళాశాల బాలుర వసతి గృహ విద్యార్థులకు దోమతెరల పంపిణీ

📰 Generate e-Paper Clip

కడప : ప్రజావాణి నవంబర్ (12)

ప్రభుత్వ కళాశాల బాలుర వసతి గృహ విద్యార్థులకు దోమతెరల పంపిణీ

ప్రకాశ్ నగర్‌లోని ప్రభుత్వ కళాశాల బాలుర వసతి గృహంలో విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు.

విద్యార్థుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని వసతి గృహంలో ఉంటున్న విద్యార్థులకు దోమతెరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ASWO లక్ష్మీనారాయణ, HWO హరికృష్ణ పాల్గొని విద్యార్థులకు దోమతెరలను అందజేశారు.

ఈ సందర్భంగా ASWO లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, వసతి గృహాల్లో చదువుకుంటున్న విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. దోమల వల్ల మలేరియా, డెంగ్యూ వంటి ప్రమాదకర వ్యాధులు వ్యాపించే అవకాశం ఉన్నందున విద్యార్థులు ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ముఖ్యంగా రాత్రి సమయంలో నిద్రించేటప్పుడు తప్పనిసరిగా దోమతెరలను వినియోగించాలని తెలిపారు.

ASWO లక్ష్మీనారాయణ ,HWO హరికృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు ఆరోగ్యానికి కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంతో పాటు వసతి గృహ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. వసతి గృహంలో విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం, వారి సంక్షేమాన్ని పరిరక్షించడం తమ ప్రాధాన్యత అని పేర్కొన్నారు.

ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం కోసం అందిస్తున్న సదుపాయాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. దోమతెరల పంపిణీతో విద్యార్థులకు దోమల బెడద నుంచి రక్షణ లభించడంతో పాటు ఆరోగ్య సమస్యలను ముందుగానే నివారించేందుకు అవకాశం కలుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమం పట్ల విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వసతి గృహ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.