*నవంబర్ 17 న CPS ఉద్యోగుల సామూహిక సెలవు*
*CPS రద్దు కై CPS ఉద్యోగుల సామూహిక సెలవు, ధర్మ దీక్ష*
పాల్వంచ,నవంబర్11
మన సమగ్ర ప్రజావాణి
*తుక్కాని శ్రీనివాసరెడ్డి ,భద్రాద్రి జిల్లా CPS యూనియన్ అధ్యక్షుడు*
CPS ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ మ్యానిఫెస్టో రోజు అయినటువంటి నవంబర్ 17 న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 2.6 లక్షల CPS ఉద్యోగ ఉపాధ్యాయలు ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా సామూహికంగా సెలవు పెట్టి కలెక్టరేట్ ధర్నా చౌక్ ప్రాంగణం లో ఒక్క రోజు ధర్మ దీక్ష చేస్తున్నట్టు CPS యూనియన్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు తుక్కాని శ్రీనివాసరెడ్డి తెలియజేశారు.
నవంబర్ 17న భద్రాద్రి జిల్లాలోని CPS ఉద్యోగ ఉపాధ్యాయులు అందరూ ఒక రోజు సెలవు పెట్టి కొత్తగూడెం కలెక్టరేట్ ప్రాంగణంలో ఉన్న ధర్నా చౌక్ దగ్గరికి వచ్చి ధర్మదీక్షలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమానికి జిల్లాలోని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకులను కలిసి మద్దతు కోరుతున్నట్లు తెలియజేశారు..
*ప్రధాన డిమాండ్లు*
కాంగ్రెస్ ప్రభుత్వం సాధారణ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ ప్రకారం వెంటనే CPS రద్దు చేయాలి.
JAC నాయకులకు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ గారు రాతపూర్వకంగా ఇచ్చిన హామీ ప్రకారం వెంటనే సిపిఎస్ రద్దు కోసం కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీలో సిపిఎస్ సంఘానికి ప్రాతినిధ్యం కల్పించాలి.
ఎంప్లాయిస్ హెల్త్ స్కీం లో రిటైర్ అయినటువంటి సిపిఎస్ ఉద్యోగులకు కూడా ట్రీట్మెంట్ అవకాశం కల్పించాలి, హెల్త్ స్కీం ట్రస్ట్ బోర్డులో సిపిఎస్ సంఘానికి ప్రాతినిధ్యం కల్పించాలి .
సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులకు ఉన్నటువంటి కరువు భత్యం బకాయిలను ఒకేసారి నగదు రూపంలో రూపంలో చెల్లించాలి.
రాబోయే రోజుల్లో ఇచ్చేటువంటి పి ఆర్ సి, డి ఎ బకాయిలను కూడా నగదు రూపంలో సిపిఎస్ ఉద్యోగులకు ఒకేసారి చెల్లించాలి..
TSCPSEU భద్రాద్రి ఆధ్వర్యంలో జరిగే సామూహిక సెలవు, ఒక్కరోజు ధర్మ దీక్ష కార్యక్రమానికి వివిధ సంఘాల నాయకులను ఆహ్వానించే కార్యక్రమంలో టీఎస్ సిపిఎస్ ఈ యు జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ ఉపాధ్యక్షుడు రామకృష్ణ ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీనివాస్ గారు మరియు ఇతర సీపీఎస్ ఉద్యోగులు పాల్గొన్నారు..


