📄 ePaper
Epaper 2
Thursday, November 12, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణకొలనూరు పాఠశాలలో ప్యానెల్ బృందం విద్యా పరిశీలన

కొలనూరు పాఠశాలలో ప్యానెల్ బృందం విద్యా పరిశీలన

📰 Generate e-Paper Clip

కొలనూరు పాఠశాలలో ప్యానెల్ బృందం విద్యా పరిశీలన

విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల పెంపునకు ఉపాధ్యాయులకు పలు సూచనలు

ఓదెల, పెద్దపల్లి ప్రజావాణి ప్రతినిధి:

కొలనూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం విద్యాశాఖ ప్యానెల్ బృందం ఆధ్వర్యంలో అకడమిక్ తనిఖీ నిర్వహించారు. ప్యానెల్ టీమ్ అధికారి ఆగయ్య నేతృత్వంలో పాఠశాలకు విచ్చేసిన బృందం సభ్యులు పాఠశాలలో కొనసాగుతున్న బోధనాభ్యసన ప్రక్రియలను, విద్యార్థుల విద్యా ప్రమాణాలను క్షుణ్ణంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా ప్యానెల్ బృందం సభ్యులు వివిధ తరగతి గదులను సందర్శించి ఉపాధ్యాయుల బోధనా తీరును పరిశీలించారు. విద్యార్థుల ప్రగతి నివేదికలు, రికార్డులు, ఉపాధ్యాయుల డైరీలను తనిఖీ చేయడంతో పాటు విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి అభ్యసన సామర్థ్యాలను అంచనా వేశారు.

చదువులో వెనుకబడిన విద్యార్థుల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న రెమిడియల్ తరగతుల తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ, వారందరూ కనీస అభ్యసన సామర్థ్యాలను సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు.

అదేవిధంగా డిజిటల్ విద్యలో భాగంగా ఖాన్ అకాడమీ వేదికను విద్యార్థులు వినియోగిస్తున్న తీరును పరిశీలించారు. గణితం, విజ్ఞానశాస్త్రం వంటి క్లిష్టమైన అంశాలను సులభంగా అర్థం చేసుకునేందుకు డిజిటల్ బోధనా వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని బోధనలో భాగస్వామ్యం చేస్తూ విద్యార్థుల విద్యా ఫలితాలను మరింత మెరుగుపరచాలని ఉపాధ్యాయులకు దిశానిర్దేశం చేశారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నిట్టూరి యేసుదాసు, ఉపాధ్యాయ బృందం, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.