📄 ePaper
Epaper 2
Thursday, November 12, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఎమ్మెల్యే యశస్విని రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన వంగల కల్యాణి మల్లారెడ్డి

ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన వంగల కల్యాణి మల్లారెడ్డి

📰 Generate e-Paper Clip

ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన వంగల కల్యాణి మల్లారెడ్డి

జనగామ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎన్నికైనందుకు శుభాకాంక్షలు

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 11 (ప్రజావాణి): పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి ని నూతనంగా జనగామ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎన్నికైన వంగల కల్యాణి మల్లారెడ్డి బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వంగల కల్యాణి మల్లారెడ్డి కి శాలువా కప్పి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లాలో మహిళా కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.

కాంగ్రెస్ పార్టీ ఆశయాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తూ, మహిళా సాధికారతకు ప్రాధాన్యతనిస్తూ పార్టీ అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని సూచించారు. గ్రామ స్థాయి నుంచి మహిళా నాయకత్వాన్ని బలోపేతం చేసి, మహిళల సమస్యల పరిష్కారానికి ముందుండాలని తెలిపారు.

జనగామ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన వంగల కల్యాణి మల్లారెడ్డి మాట్లాడుతూ, తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన పార్టీ అధిష్టానానికి, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ధికి, మహిళా నాయకులు, కార్యకర్తల ఐక్యతకు కృషి చేస్తానని, మహిళా కాంగ్రెస్‌ను జిల్లాలో మరింత బలోపేతం చేస్తానని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.