📄 ePaper
Epaper 2
Sunday, November 8, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణహాట్ టాపిక్ గా మారిన హోంగార్డ్ వ్యవహారం

హాట్ టాపిక్ గా మారిన హోంగార్డ్ వ్యవహారం

📰 Generate e-Paper Clip

హాట్ టాపిక్ గా మారిన హోంగార్డ్ వ్యవహారం

– ఎక్కడ చూసినా అతగాడి ముచ్చటే
– అతగాడిని మరోసారి గుర్తు చేసుకున్న జిల్లా ప్రజలు

– ప్రజావాణి కథనం పై ఇంటెలిజెన్స్ అధికారుల ఆరా..?

– చర్యలు ఉంటాయా..? లేక వదిలేస్తారా..? అనేది ప్రధాన చర్చ

.ములుగు ప్రతినిధి(ప్రజావాణి)

ములుగు జిల్లాలో కోట్లకు పడగెత్తిన హోంగార్డ్ వ్యవహారంపై ప్రజావాణి పేపర్ లో వెలువడిన కథనం జిల్లా వ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసింది. దీంతో రెండో రోజు కూడా ఇదే అంశం ప్రధాన చర్చాంశంగా మారింది. టీ కొట్ల దగ్గర నుంచి సోషల్ మీడియా వరకు, గ్రామాల నుంచి జిల్లా కేంద్రం వరకు ప్రతిచోటా అతగాడి గురించి మాట్లాడే మాటలే వినిపించడం జరిగింది. అసలు హోంగార్డ్ అయి ఉండి ఇంత ఆస్తి ఎలా సంపాదించాడు, అతడి వెనుక ఎవరున్నారు అనేది ప్రజల్లో పెద్ద ప్రశ్న. ప్రజలు మరోసారి సదరు హోంగార్డ్ ను గుర్తు చేసుకుంటున్నట్టు అయ్యింది. గతంలో అతని వ్యవహార శైలి, అతనితో సంబంధం ఉన్న వ్యక్తులు, అతని పేరుతో జరిగిన వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా గుట్కా, గుడుంబా వ్యాపారాల నుంచి నెల నెలా భారీగా వసూళ్లు జరుగుతున్నాయనే ఆరోపణలపై జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. సదరు హోంగార్డ్ ఏ విభాగంలో విధులు నిర్వహిస్తున్నాడో కూడా చాలా మందికి తెలియకపోవడం మరింత అనుమానాలకు దారి తీస్తోంది. డ్యూటీ చేస్తున్నాడా, లేక డ్యూటీ పేరుతో బయట వ్యవహారాలు చూసుకుంటున్నాడా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఒక హోంగార్డ్ స్థాయిలో ఉండి కోట్ల రూపాయల ఆస్తి ఎలా కూడబెట్టాడన్నదే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అతనికి అండదండలు ఎవరివి, పై అధికారులకు ఈ విషయం తెలియదా, తెలిసీ చూసీ చూడనట్టు వదిలేశారా అనే ప్రశ్నలు బలంగా వినిపిస్తున్నాయి. గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఏ చర్యా లేకుండా వదిలేయడం వల్లనే ఇప్పుడు ఇంత స్థాయికి వెళ్లిందని సామాన్య ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఈ కథనం వెలువడిన తర్వాత ఉన్నతాధికారులు స్పందించి విచారణకు ఆదేశిస్తారా, లేక ఎప్పటిలాగే ఫైల్ మూసేస్తారా అన్నదే ఇప్పుడు జిల్లా ప్రజల్లో ప్రధాన చర్చగా మారింది. ప్రజలు కోరుతున్నది ఒక్కటే, కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా లోతైన విచారణ జరపాలి. సదరు హోంగార్డ్ ఆదాయానికి మించిన ఆస్తులపై, బ్యాంకు లావాదేవీలపై, అతని పేరుతో, బినామీ పేర్లతో ఉన్న భూములు, ఇళ్లు, వ్యాపారాలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి, అతనికి సహకరించిన వారిపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత గుట్కా, గుడుంబా వ్యాపారుల్లోనూ ఆందోళన మొదలైంది. గతంలో తాము నెల నెలా ఇచ్చిన మామూళ్ల విషయం బయటకు వస్తుందేమోనని కొందరు భయపడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. ఒకవేళ పోలీసులు చిత్తశుద్ధితో విచారణ చేస్తే అనేక కీలక విషయాలు బయటపడే అవకాశం ఉందని అంటున్నారు. అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటేనే ప్రజలకు పోలీస్ వ్యవస్థపై నమ్మకం పెరుగుతుందని, లేదంటే ఇలాంటి వారు మరింత రెచ్చిపోతారని ప్రజా సంఘాల నేతలు అంటున్నారు. ఇప్పుడు అందరి దృష్టి ఉన్నతాధికారులపైనే ఉంది. విచారణకు ఆదేశిస్తారా, నివేదిక తెప్పించుకుంటారా, సదరు హోంగార్డ్ ను విధుల నుంచి తప్పించి లోతుగా విచారిస్తారా, లేక కాలం గడిచే కొద్దీ ఈ వ్యవహారాన్ని మరుగున పడేస్తారా అనేది వేచి చూడాల్సిందే. ఇది ఇలా ఉండగా, ప్రజావాణి దినపత్రికలో ములుగు జిల్లా లో “కోట్లకు పడగెత్తిన హోంగార్డు ” అనే కథనం పై ఇంటిలిజెన్సీ అధికారులు ఆర తీస్తున్నట్లు తెలిసింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.