స్వర్ణనంది పురస్కారం లభించిన హింగే భాస్కర్ కు పలువురి ఘన సన్మానం.
ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్:-
ఎల్కతుర్తి మండల కేంద్రంలో సూరారం గ్రామానికి చెందిన ఉమ్మడి హనుమకొండ–కరీంనగర్ జిల్లాల రైతు రక్షణ సమితి అధ్యక్షులు హింగే భాస్కర్‌కు స్వర్ణనంది పురస్కారం లభించిన సందర్భంగా జిల్లా,మండల స్థాయి నాయకులు ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా నాయకులు హింగే భాస్కర్‌ను శాలువాతో సత్కరించి,స్వర్ణనంది పురస్కారం అందుకున్నందుకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. రైతుల సంక్షేమం కోసం ఆయన చేస్తున్న కృషి, రైతుల సమస్యల పరిష్కారానికి అందిస్తున్న సేవలను నాయకులు ఈ సందర్భంగా కొనియాడారు.
భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పురస్కారాలు అందుకోవాలని,మరిన్ని ఉన్నత పదవులు చేపట్టి ప్రజలకు,రైతులకు విశేష సేవలు అందించాలని ఆకాంక్షించారు.హింగే భాస్కర్ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని నాయకులు మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు.

