శ్రీ పాద వల్లభ ట్రస్టు ఆధ్వర్యంలో మహా అన్న ప్రసాద వితరణ

మేడ్చల్, నవంబర్ 9: ఆకలితో, దప్పికతో ఎవ్వరూ ఇబ్బంది పడకూడదనే సదుద్దేశంతో శ్రీ పాద వల్లభ ట్రస్టు ఆధ్వర్యంలో ప్రతి నెల అమావాస్య రోజున నిర్వహిస్తున్న మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం సోమవారం మేడ్చల్‌లోని ఏడు గుళ్ళు అమ్మవారి ఆలయం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది భక్తులు, పేదలు, వృద్ధులు, కూలీలు, బాటసారులు పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. అన్నదానం మహాదానం అనే స్ఫూర్తితో ట్రస్టు సభ్యులు భక్తిశ్రద్ధలతో స్వయంగా అందరికీ ప్రేమతో అన్న ప్రసాదాన్ని వడ్డించారు. ఈ...