📄 ePaper
Epaper 2
Thursday, November 5, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణవిద్యుత్ పొదుపు ప్రతి ఒక్కరి బాధ్యత

విద్యుత్ పొదుపు ప్రతి ఒక్కరి బాధ్యత

📰 Generate e-Paper Clip

విద్యుత్ పొదుపు ప్రతి ఒక్కరి బాధ్యత

జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్

ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

సూపర్ ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో విద్యుత్ వినియోగాన్ని తగ్గించి, విద్యుత్‌ను పొదుపు చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అన్నారు.

సోమవారం కలెక్టరేట్‌లో ట్రైనీ కలెక్టర్ పారస్ కుమార్‌తో కలిసి విద్యుత్ పొదుపుపై రూపొందించిన అవగాహన పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర్ టి ఎస్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో విద్యుత్‌ను పొదుపుగా వినియోగించడం ఎంతో అవసరమని తెలిపారు. ఇళ్లలో, కార్యాలయాల్లో అవసరం లేనప్పుడు ఫ్యాన్లు, లైట్లు ఆఫ్ చేయాలని, టీవీలను వినియోగించని సమయంలో పూర్తిగా స్విచ్ ఆఫ్ చేయాలని సూచించారు. పొదుపు చేసిన విద్యుత్తు ఉత్పత్తి చేసిన విద్యుత్తుతో సమానమని, విద్యుత్ ఆదా చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడిన వారమవుతామని తెలిపారు.

లైఫ్ మిషన్‌లో భాగంగా పర్యావరణహిత జీవనశైలిని ప్రతిఒక్కరూ అలవర్చుకోవాలని సూచించారు. చిన్న చిన్న మార్పులు, అలవాట్ల ద్వారా పెద్ద మొత్తంలో విద్యుత్‌ను ఆదా చేయవచ్చని పేర్కొన్నారు.

విద్యుత్ వినియోగాన్ని తగ్గించేందుకు బీఈఈ స్టార్ రేటింగ్ కలిగిన విద్యుత్ ఉపకరణాలు, ఇంధన సామర్థ్యం కలిగిన పరికరాలను వినియోగించాలని సూచించారు. వీటి ద్వారా విద్యుత్ వినియోగం తగ్గడంతో పాటు విద్యుత్ బిల్లులు కూడా తగ్గుతాయని తెలిపారు.

సౌర విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించాలని, ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించడం ద్వారా వాహనాల నుంచి వెలువడే కాలుష్యాన్ని తగ్గించి స్వచ్ఛమైన పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వల్ల ఇంధన ఖర్చులు తగ్గడంతో పాటు పర్యావరణానికి మేలు జరుగుతుందని పేర్కొన్నారు.

వేసవిలో ఏసీలను 25 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఉంచడం ద్వారా విద్యుత్ వినియోగాన్ని తగ్గించవచ్చని, మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఎనర్జీ సేవింగ్ మోడ్‌ను వినియోగించాలని సూచించారు. దీనివల్ల విద్యుత్ ఆదా కావడంతో పాటు పరికరాల బ్యాటరీ సామర్థ్యం, జీవితకాలం పెరుగుతాయని తెలిపారు.

విద్యుత్ పొదుపు వల్ల విద్యుత్ బిల్లుల తగ్గింపు, ఇంధన భద్రత, మెరుగైన ఆరోగ్యం, స్వచ్ఛమైన పర్యావరణం, సహజ వనరుల పరిరక్షణతో పాటు భవిష్యత్ తరాలకు స్థిరమైన పర్యావరణాన్ని అందించవచ్చని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.

కార్యక్రమం ముగింపులో జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, ట్రైనీ కలెక్టర్ పారస్ కుమార్‌తో పాటు అధికారులు, సిబ్బంది విద్యుత్ పొదుపుపై ప్రతిజ్ఞ చేశారు. విద్యుత్‌ను అవసరమైన మేరకే వినియోగిస్తామని, అనవసర విద్యుత్ వినియోగాన్ని నివారిస్తామని, విద్యుత్ ఆదా చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.

ప్రతి ఒక్కరూ విద్యుత్ పొదుపును తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకొని, విద్యుత్ ఆదా చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. అనంతరం విద్యుత్ ఆదాకు సంబంధించిన గోడ ప్రతిని ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి రామ్మూర్తి, విద్యుత్ శాఖ ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసా చారి,
జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.