ఘట్‌కేసర్, అక్టోబర్ 31 (ప్రజా వాణి): కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపు మేరకు, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలతో ఢిల్లీలోని రాంలీలా మైదానంలో నిర్వహించనున్న కార్యక్రమంలో పాల్గొనేందుకు పోచారం డివిజన్ కాంగ్రెస్ నాయకులు ఢిల్లీకి బయలుదేరారు. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ ఆదేశాల మేరకు, పోచారం డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కర్ర రాజేష్ ఆధ్వర్యంలో ముఖ్య నాయకులు, పార్టీ శ్రేణులు ఈ పర్యటన చేపట్టారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, ప్రజల హక్కుల సాధన, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల బలోపేతమే లక్ష్యంగా జాతీయ నాయకత్వం ఇచ్చిన పిలుపుకు మద్దతుగా కాంగ్రెస్ శ్రేణులు ఐక్యంగా తరలివెళ్లారు.

