📄 ePaper
Epaper 2
Sunday, November 1, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణకంగ్టి ఎంపీడీవో దయాకర్ రావుకు సర్పంచుల ఘన వీడ్కోలు

కంగ్టి ఎంపీడీవో దయాకర్ రావుకు సర్పంచుల ఘన వీడ్కోలు

📰 Generate e-Paper Clip

కంగ్టి ఎంపీడీవో దయాకర్ రావుకు సర్పంచుల ఘన వీడ్కోలు

నారాయణఖేడ్ ఆర్సి, అక్టోబర్ 31 (ప్రజావాణి):

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) దయాకర్ రావు పదవీ విరమణ సందర్భంగా మండలంలోని సర్పంచులు ఘనంగా వీడ్కోలు పలికి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి, పూలమాల వేసి ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా సర్పంచ్ శరణప్ప మాట్లాడుతూ.. ఎంపీడీవో దయాకర్ రావు మండలంలో పనిచేసిన సమయంలో గ్రామాల అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి అందించిన సేవలు ప్రశంసనీయమని అన్నారు. ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ గ్రామాల అభివృద్ధికి ఎంతగానో సహకరించారని కొనియాడారు. విధి నిర్వహణలో ఆయన అందించిన సహకారం ఎప్పటికీ గుర్తుండిపోతుందని పేర్కొన్నారు.పదవీ విరమణ అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామ సర్పంచులు, పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.