📄 ePaper
Epaper 2
Sunday, November 1, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఎంపీడీవో దయాకర్ సేవలు అభినందనీయం: ఆత్మ చైర్మన్ వినోద్ పటేల్

ఎంపీడీవో దయాకర్ సేవలు అభినందనీయం: ఆత్మ చైర్మన్ వినోద్ పటేల్

📰 Generate e-Paper Clip

*ఎంపీడీవో దయాకర్ సేవలు అభినందనీయం: ఆత్మ చైర్మన్ వినోద్ పటేల్*

*పదవీ విరమణ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులు*

నారాయణఖేడ్, అక్టోబర్ 31 (ప్రజావాణి):

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) దయాకర్ పదవీ విరమణ కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆత్మ చైర్మన్ వినోద్ పటేల్, నారాయణఖేడ్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ దారం శంకర్, కౌన్సిలర్ బాణపురం రాజు హాజరై దయాకర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తూ ప్రజలకు, మండల అభివృద్ధికి అందించిన సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసి పదవీ విరమణ పొందడం సంతోషకరమైన విషయమన్నారు. ఉద్యోగ జీవితంలో ఎన్నో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించిన దయాకర్, ఇకపై కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు.దయాకర్ తన శేష జీవితాన్ని ఆయురారోగ్యాలతో,సుఖసంతోషాలతో గడపాలని, కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండాలని వారు మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. ఈ సందర్భంగా దయాకర్‌కు, ఆయన కుటుంబ సభ్యులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.