మానసిక వికలాంగుల పాఠశాలలోప్రభుత్వ విప్ డా వెంకట్ బాల్మూర్ జన్మదిన వేడుకలు
* సత్యసాయి పాఠశాలలో కేక్ కట్ చేసి విద్యార్థులకు పండ్ల పంపిణీ
* కాంగ్రెస్ యువ నాయకులు ఆధ్వర్యంలో వేడుకలు
జమ్మికుంట నవంబర్ 2 (ప్రజావాణి)
ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ డా వెంకట్ బాల్మూర్ జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమాల మధ్య ఘనంగా నిర్వహించారు బాబాజీ నాగరాజు ఆధ్వర్యంలో జమ్మికుంట పట్టణంలోని సత్యసాయి మానసిక వికలాంగుల పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమాన్నిఏర్పాటుచేశారుఈ సందర్భంగా పాఠశాల విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. అనంతరం విద్యార్థులకు పండ్లు పంపిణీ చేసి, వారితో కలిసి భోజనం చేశారు. ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులతో ఆప్యాయంగా గడుపుతూ వారి ముఖాల్లోఆనందాన్నినింపారుజన్మదిన వేడుకలను కేవలం ఆడంబరాలకు పరిమితం చేయకుండా సేవా కార్యక్రమాలతో నిర్వహించడం ద్వారా సామాజిక బాధ్యతను చాటుకున్నారుఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూజన్మదినాలు సేవా కార్యక్రమాలతో నిర్వహించడం అభినందనీయమని సమాజంలోని నిరుపేదలు అవసరమైన వారికి అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారుఈ కార్యక్రమంలో కాంగ్రెస్ యువ నాయకులు సుంకరి శ్యామ్ మాచర్ల వినయ్ మాచనపల్లి సర్పంచ్ విజయ్ రంజిత్ రెడ్డి సంపత్ రెడ్డి విశ్వంత్ రాజు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు

