📄 ePaper
Epaper 2
Thursday, November 5, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణపేద విద్యార్థుల చదువుకు అండగా బండి సంజయ్

పేద విద్యార్థుల చదువుకు అండగా బండి సంజయ్

📰 Generate e-Paper Clip

పేద విద్యార్థుల చదువుకు అండగా బండి సంజయ్

కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో 10,959 మంది పదో తరగతి విద్యార్థుల పరీక్ష ఫీజుల చెల్లింపు

బెజ్జంకి,నవంబర్ 4 (ప్రజావాణి)

పేద విద్యార్థుల చదువుకు ఆర్థిక ఇబ్బందులు అడ్డుకాకూడదనే లక్ష్యంతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తన ఉదారతను చాటుకున్నారు.కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న 10,959 మంది విద్యార్థుల పరీక్ష ఫీజులను ఈ ఏడాది కూడా తానే చెల్లించనున్నట్లు ప్రకటించారు.జిల్లాల వారీగా రాజన్న సిరిసిల్లలో 3,920 మంది, కరీంనగర్‌లో 4,356 మంది, జగిత్యాలలో 1,087 మంది, సిద్దిపేటలో 1,133 మంది, హన్మకొండలో 463 మంది విద్యార్థులకు ఈ నిర్ణయంతో ప్రయోజనం చేకూరనుంది. విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పిస్తూ,పేద కుటుంబాలకు ఆర్థిక ఊరటనిచ్చేలా బండి సంజయ్ తీసుకున్న నిర్ణయంపై విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.