పేద విద్యార్థుల చదువుకు అండగా బండి సంజయ్
పేద విద్యార్థుల చదువుకు అండగా బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో 10,959 మంది పదో తరగతి విద్యార్థుల పరీక్ష ఫీజుల చెల్లింపు బెజ్జంకి,నవంబర్ 4 (ప్రజావాణి) పేద విద్యార్థుల చదువుకు ఆర్థిక ఇబ్బందులు అడ్డుకాకూడదనే లక్ష్యంతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తన ఉదారతను చాటుకున్నారు.కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న 10,959 మంది విద్యార్థుల పరీక్ష ఫీజులను ఈ ఏడాది కూడా తానే చెల్లించనున్నట్లు ప్రకటించారు.జిల్లాల వారీగా రాజన్న సిరిసిల్లలో 3,920...