*నిరుపేదలకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్*
* *మన ప్రజావాణి మందమర్రి:-*
నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తూ ముఖ్యమంత్రి సహాయ నిధితో నిరుపేదల వైద్యానికి ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుందని మండలంలోని చిర్రకుంట గ్రామ సర్పంచ్ శ్రీలత – తిరుపతి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గందె రాంచందర్ లు తెలిపారు. గ్రామానికి చెందిన కర్రె రాజయ్య వైద్య ఖర్చుల నిమిత్తం మంజూరైన 60 వేల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును బుధవారం గ్రామంలో లబ్ధిదారునికి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్ర మంత్రి, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డ వంశీకృష్ణ ఆదేశాల మేరకు గ్రామానికి చెందిన కర్రె రాజయ్య కు మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఓదెల సంపత్ రావు, అత్తి పోశయ్య, గ్రామ ఉపసర్పంచ్ జనార్ధన్, వార్డు సభ్యుడు సల్లూరి సుధాకర్, నాయకులు మెండే పోచయ్య, దుర్గం శ్యామందర్ లు పాల్గొన్నారు.
