📄 ePaper
Epaper 2
Tuesday, November 10, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణనల్లకుంట తండాలో ఘనంగా ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం, అజ్మీరా సత్తమ్మ కుటుంబంలో ఆనందం

నల్లకుంట తండాలో ఘనంగా ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం, అజ్మీరా సత్తమ్మ కుటుంబంలో ఆనందం

📰 Generate e-Paper Clip

నల్లకుంట తండాలో ఘనంగా ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం, అజ్మీరా సత్తమ్మ కుటుంబంలో ఆనందం

పాలకుర్తిలో పేదల సొంతింటి కలను నిజం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 08 (ప్రజావాణి): తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం పాలకుర్తి నియోజకవర్గంలో వేగంగా పూర్తవుతున్నాయి.

జిల్లా లోని దేవరుప్పుల మండలం, నల్లకుంట తండా గ్రామానికి చెందిన నిరుపేద అజ్మీరా సత్తమ్మ కు మంజూరైన ఇందిరమ్మ ఇంటిని ఆదివారం ఘనంగా ప్రారంభించారు.

పాలకుర్తి నియోజకవర్గ ప్రజా నాయకురాలు, ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి ఆధ్వర్యంలో, నల్లకుంట తండా గ్రామ సర్పంచ్ బానోత్ మహేందర్ నాయక్ ఈ గృహప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించి, లబ్ధిదారునికి ఇంటిని అప్పగించారు. ఇంటికి పూలతోరణాలు, ముగ్గులతో స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా సర్పంచ్ బానోత్ మహేందర్ నాయక్ మాట్లాడుతూ, మా గ్రామంలో గత 10 ఏళ్లుగా ఒక్క ఇల్లు కూడా రాలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకనే మా తండాలో నిజమైన అభివృద్ధి మొదలైందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పేదవారి కోసం చిత్తశుద్ధితో పని చేస్తున్నారని తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు అనేది కేవలం ఇల్లు కాదు, ఒక ఆత్మగౌరవం అని, అర్హులైన ప్రతి గిరిజన బిడ్డకు ఇల్లు వచ్చే వరకు తమ పోరాటం ఆగదని పేర్కొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల విశేషాలుగా ప్రతి ఇంటికి రూ. 5 లక్షల ఆర్థిక సహాయం, ఇల్లు లేని నిరుపేదలకు, గిరిజనులకు, దళితులకు మొదటి ప్రాధాన్యత, దీపావళి పండుగ నాటికి వేలాది ఇళ్లను పూర్తి చేసి ఇవ్వాలని లక్ష్యం, అందుకే మా ఇందిరమ్మ ఇల్లు – దీపావళి అని పేరు పెట్టడం జరిగిందని తెలిపారు.

లబ్ధిదారు అజ్మీరా సత్తమ్మ మాట్లాడుతూ తనకు ఇల్లు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి, యశస్విని రెడ్డి కి, సర్పంచ్ మహేందర్ నాయక్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా సొంత ఇంటి కలను కంటూ వచ్చామని, నేడు ఆ కల నెరవేరిందని ఆనందం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో వార్డు మెంబెర్స్ జాటోత్ నర్సింహా, కాంగ్రెస్ నాయకులు, గ్రామ పెద్దలు, మహిళలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.