అంబేద్కర్ విగ్రహానికి డివిజన్ అంబేద్కర్ సంఘం నాయకుల నివాళులు
మన ప్రజావాణి. మంథని ప్రతినిధి
మంథని పట్టణంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి మంథన్ డివిజన్ అంబేద్కర్ సంఘం నాయకులు పూలమాలలు వేసి ఆదివారం ఘనంగా నివాళులర్పించారు. మంథని డివిజన్ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా అంబేద్కర్ సంఘం నాయకులు అప్పాల పోషమల్లు. మాజీ వైస్ ఎంపీ వేల్పుల గట్టయ్య .ఎడ్ల కృష్ణయ్య గార్లు మాట్లాడుతూ మంథని డివిజన్ లోని అంబేడ్కర్ విగ్రహాలన్నింటికీ ప్రతి ఆదివారం రోజున ఉదయం 10 గంటలకు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులర్పించవలసిందిగా అంబేద్కర్ సంఘాలను కోరుతున్నాము. అంబేద్కర్ అభిమానులు పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయాలు, సమానత్వం, సామాజిక న్యాయం, విద్యాభివృద్ధి కోసం ఆయన చేసిన కృషిని స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం నాయకులు బీసీ సంఘం నాయకుడు ఆకుల రాజబాబు, దాసరి ధర్మేందర్, కన్నూరి బాపు, కోటేశు. గడ్డం లక్ష్మీనారాయణ, జంజర్ల చిన్నగట్టయ్య, జంజర్ల మల్లేశం, పంతకాని గట్టయ్య, మాదాసు విజయ్, జంజర్ల చిన్న మల్లయ్య, ఆర్ల లింగయ్య, జంజర్ల లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

