📄 ePaper
Epaper 2
Sunday, November 1, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణబీఆర్‌ఏఓయూ ద్వారా ఉన్నత విద్యకు విస్తృత అవకాశాలు : డాక్టర్‌ బి. ధర్మ నాయక్‌

బీఆర్‌ఏఓయూ ద్వారా ఉన్నత విద్యకు విస్తృత అవకాశాలు : డాక్టర్‌ బి. ధర్మ నాయక్‌

📰 Generate e-Paper Clip

*బీఆర్‌ఏఓయూ ద్వారా ఉన్నత విద్యకు విస్తృత అవకాశాలు : డాక్టర్‌ బి. ధర్మ నాయక్‌*

*ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందించే నూతన కోర్సులు విద్యార్థులు ప్రతి ఆదివారం జరిగే బోధనా తరగతులకు తప్పనిసరిగా హాజరుకావాలి*

*నల్లగొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి*

దూరవిద్య ద్వారా ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ (బీఆర్‌ఏఓయూ) ఎన్నో అవకాశాలను కల్పిస్తోందని యూనివర్సిటీ ఎడ్యుకేషన్‌ ఎక్స్‌టెన్షన్‌ సెంటర్‌ నోడల్‌ అధికారి డాక్టర్‌ బి. ధర్మ నాయక్‌ అన్నారు. విద్యార్థుల అవసరాలు, ప్రస్తుత ఉద్యోగ, ఉపాధి రంగాల డిమాండ్‌కు అనుగుణంగా యూనివర్సిటీలో నూతన కోర్సులను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. ఆదివారం నల్లగొండ ప్రాంతీయ సమన్వయ కేంద్రంలో నూతనంగా ప్రవేశాలు పొందిన విద్యార్థుల కోసం నల్లగొండ ప్రాంతీయ సమన్వయ కేంద్రం కోఆర్డినేటర్‌ డాక్టర్‌ బొజ్జ అనిల్‌ కుమార్‌ అధ్యక్షతన నిర్వహించిన ఓరియంటేషన్‌ కార్యక్రమంలో డాక్టర్‌ బి. ధర్మ నాయక్‌ పాల్గొని మాట్లాడారు. యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ ఘంటా చక్రపాణి బాధ్యతలు స్వీకరించిన అనంతరం దూరవిద్యా విధానంలో అనేక మార్పులు, సంస్కరణలు తీసుకొచ్చారని పేర్కొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతోపాటు బోధనా విధానాన్ని మరింత మెరుగుపరిచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా లో బీఆర్‌ఏఓయూ ప్రవేశాలకు విద్యార్థుల నుంచి విశేష స్పందన లభిస్తోందని, అడ్మిషన్ల పరంగా అత్యధిక సంఖ్యలో విద్యార్థులు చేరడం సంతోషకరమని అన్నారు. దూరవిద్యను అభ్యసించే విద్యార్థులు క్రమశిక్షణతో చదువుపై దృష్టి సారించాలని సూచించారు. ప్రతి ఆదివారం నిర్వహించే బోధనా తరగతులకు విద్యార్థులు తప్పనిసరిగా హాజరుకావాలని, అధ్యాపకులు అందించే సూచనలు, సలహాలను పాటిస్తూ పాఠ్యాంశాలను క్రమం తప్పకుండా అభ్యసించాలని కోరారు. తరగతులకు హాజరవుతూ సందేహాలను నివృత్తి చేసుకోవడం ద్వారా పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. దూరవిద్యను కేవలం డిగ్రీలు పొందే మార్గంగా కాకుండా, వ్యక్తిగత అభివృద్ధికి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకునేందుకు ఒక చక్కని వేదికగా విద్యార్థులు ఉపయోగించుకోవాలని డాక్టర్‌ ధర్మ నాయక్‌ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహిళా డిగ్రీ కళాశాల కోఆర్డినేటర్ మహిళా డిగ్రీ కళాశాల అధ్యయన కేంద్రం కోఆర్డినేటర్‌ భూక్యా వీరన్న, కౌన్సిలర్లు కృష్ణ రెడ్డి, మహేశ్వరీ, పద్మ హరిత, మహేష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.