తొర్రూర్ లో పేకాటరాయుళ్ల అరెస్ట్
ఎస్సై మహేందర్ రెడ్డి తొర్రూరు నవంబరు 1(ప్రజావాణి) స్థానిక పట్టణ పరిసర ప్రాంతాల్లో అక్రమ కార్యకలాపాలపై నిఘా పెంచిన పోలీసులు పేకాట స్థావరంపై దాడి నిర్వహించారు. నమ్మదగిన సమాచారం మేరకు జమ్లా తండా సమీపంలో పేకాట ఆడుతున్న స్థావరంపై తొర్రూరు పోలీసులు ఆకస్మికంగా దాడి చేశారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.3,700 నగదుతో పాటు 52 పేకాట ముక్కలు, ఐదు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన...