📄 ePaper
Epaper 2
Monday, November 2, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriతెలంగాణ అంబేద్కర్ సంఘం పోచారం డివిజన్ నూతన కమిటీ ఎన్నిక

తెలంగాణ అంబేద్కర్ సంఘం పోచారం డివిజన్ నూతన కమిటీ ఎన్నిక

📰 Generate e-Paper Clip

ఘట్‌కేసర్, నవంబర్ 1 (ప్రజావాణి): తెలంగాణ అంబేద్కర్ సంఘం పోచారం డివిజన్ నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఏర్పుల శ్రీహరి, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏనుతుల నాగేష్, ప్రధాన కార్యదర్శి ముత్యాల జంగయ్య, కోశాధికారి మోటుపల్లి శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు మీసాల శ్రీరాములు, కిన్నెర రవీందర్ హాజరై నూతన కమిటీని ప్రకటించారు.

నూతన కమిటీ అధ్యక్షుడిగా మోటుపల్లి ప్రదీప్, అధికార ప్రతినిధిగా గ్యార గోవర్ధన్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా గుండె అర్జున్, ప్రధాన కార్యదర్శిగా మంద కృష్ణ కుమార్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా చిన్న పోసి కుమార్, కిన్నెర కమలాకర్, పూలగోని మహేష్ గౌడ్, సహాయ కార్యదర్శిగా బొడ్డు సత్యనారాయణ, ప్రచార కార్యదర్శులుగా మీసాల శ్రీరాములు, ఎర్రబెల్లి భాస్కర్ తదితరులను ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు ఏర్పుల శ్రీహరి మాట్లాడుతూ నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. సంఘాన్ని మరింత పటిష్టం చేయడంతో పాటు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలు, ఆలోచనా విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో తెలంగాణ అంబేద్కర్ సంఘం కమిటీలను ఏర్పాటు చేయాలని, దళితులంతా ఐక్యంగా ఉండి హక్కుల సాధనకు కృషి చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఘట్‌కేసర్ మాజీ సర్పంచ్ మేకల నర్సింగరావు, ఎన్ఎఫ్‌సీ నగర్ మాజీ సర్పంచ్ స్టీవెన్, చౌదరిగూడ మాజీ వార్డు సభ్యులు మంద స్వామిదాస్, మాటూరి రవీందర్, దయ్యాల ఆంజనేయులు, మంద విజయ్ కుమార్, నాగులపల్లి శ్రీనివాస్, పంగా అయోధ్య, చుంచు నవీన్, ఎనుతూల నరేందర్, కిన్నెర ప్రవీణ్, సుధాకర్, శ్యామ్, బిక్షపతి, మధు తదితరులు పాల్గొన్నారు. సుమారు పది గ్రామాల నుంచి 60 మంది హాజరై నూతన కమిటీకి అభినందనలు తెలిపారు. జై భీమ్ నినాదాలతో కార్యక్రమం ఉత్సాహంగా సాగింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.