📄 ePaper
Epaper 2
Tuesday, November 10, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణడాక్టర్ అందెశ్రీ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

డాక్టర్ అందెశ్రీ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

📰 Generate e-Paper Clip

డాక్టర్ అందెశ్రీ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

మద్దూరు నవంబర్10, ప్రజా వాణి,

ప్రముఖ కవి, తెలంగాణ ఉద్యమ గేయకారుడు డాక్టర్ అందెశ్రీ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఘట్కేసర్‌లోని స్ఫూర్తి వనం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా తెలంగాణ సమాజానికి, సాహిత్య రంగానికి అందెశ్రీ అందించిన విశిష్ట సేవలను స్మరించుకున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తన కలం, గళం ద్వారా ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని నింపిన మహనీయుడు అందెశ్రీ అని కొనియాడారు. ఆయన రచనలు, గేయాలు తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని, ఆయన లేని లోటు తెలంగాణ సమాజానికి తీరని లోటని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నీరటి శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ గిరి కొండల్ రెడ్డి, కొమ్ము నరసింహరావు, మాజీ సర్పంచ్ బొమ్మగాని శివయ్య గౌడ్, మల్లేశం, బచ్చల హరీష్, అందే బాలరాజు, అందే రాజు, అందే మహేందర్, ఎర్ర బచ్చల బాలమల్లు, ఎండి అజీమ్ తదితరులు పాల్గొని నివాళులర్పించారు.
డాక్టర్ అందెశ్రీ గారి ఆశయాలు, సాహిత్య స్ఫూర్తి చిరకాలం నిలిచి ఉంటాయన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.