📄 ePaper
Epaper 2
Wednesday, November 11, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్టికెట్ పేరుతో కోట్ల దందా.కాంట్రాక్టర్లకు ప్రజాసేవ ఏం తెలుసు? సర్పంచ్ ఎన్నికలను అడ్డుకుంటే పోలీస్ స్టేషన్ల...

టికెట్ పేరుతో కోట్ల దందా.కాంట్రాక్టర్లకు ప్రజాసేవ ఏం తెలుసు? సర్పంచ్ ఎన్నికలను అడ్డుకుంటే పోలీస్ స్టేషన్ల వద్దే ఎమ్మెల్యేతో కలిసి ధర్నా: గోవిందరెడ్డి సంచలన హెచ్చరిక

📰 Generate e-Paper Clip

పోరుమామిళ్ల (కడప జిల్లా) నవంబర్ 11 ప్రజావాణి స్థానిక సంస్థల ఎన్నికల సమరం వేడెక్కుతున్న తరుణంలో బద్వేలు నియోజకవర్గ రాజకీయాల్లో పెను దుమారం రేగింది. కడప జిల్లా పోరుమామిళ్ల మండలంలోని తన నివాసంలో,పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక విలేకరుల సమావేశంలో గోవిందరెడ్డి అధికార పార్టీ తీరుపై నిప్పులు చెరిగారు.ముఖ్యంగా బద్వేలు టీడీపీ ఇన్‌ఛార్జి సూర్యనారాయణ రెడ్డి లక్ష్యంగా ఆయన చేసిన సంచలన ఆరోపణలు నియోజకవర్గ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

“ప్రజాస్వామ్యాన్ని వ్యాపారంగా మార్చారు”

ఇటీవల ముగిసిన ఎంపీటీసీ,జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ బద్వేలు ఇన్‌ఛార్జి సూర్యనారాయణ రెడ్డి అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని గోవిందరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.పార్టీ టికెట్లను వేలం పాటలా అమ్ముకున్నారని ఆరోపిస్తూ. ఒక్కో ఎంపీటీసీ టికెట్ కోసం రూ.10 లక్షల నుండి రూ. 15 లక్షల వరకు, జడ్పీటీసీ టికెట్ కోసం ఏకంగా రూ.కోటి రూపాయలు, అలాగే కార్పొరేటర్ టికెట్ కోసం రూ.25 లక్షల వరకు డిమాండ్ చేసి వసూలు చేశారని ఆయన వివరించారు.ఈ సందర్భంగా సూర్యనారాయణ రెడ్డి గత నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ గోవిందరెడ్డి ఘాటైన విమర్శలు చేశారు.రాజకీయం అంటే ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకోవడం. కానీ, గతంలో కాంట్రాక్టర్‌గా పనిచేసిన వ్యక్తికి నిత్యం లాభనష్టాలు, సంపాదన మీదనే ధ్యాస ఉంటుంది తప్ప, ప్రజలకు సేవ చేయాలనే రాజకీయ ఆలోచన ఏమాత్రం ఉండదు. పదవులను డబ్బుకు అమ్ముకునే సంస్కృతిని బద్వేలు గడ్డపై ప్రవేశపెట్టడం సిగ్గుచేటు” అని ఆయన మండిపడ్డారు.

“నామినేషన్లను అడ్డుకుంటే సహించే ప్రసక్తే లేదు”

రాబోయే గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల ప్రక్రియపై గోవిందరెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూనే,అధికార యంత్రాంగానికి గట్టి హెచ్చరికలు జారీ చేశారు.సర్పంచ్ ఎన్నికల్లో తమ పార్టీ బలపరిచిన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడానికి వెళ్తున్నప్పుడు పోలీసులు గానీ, టీడీపీ నాయకులు గానీ అధికార బలంతో అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ చూస్తూ ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.”ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ పోటీ చేసే హక్కు ఉంది.ఒకవేళ అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గి పోలీసులు గానీ, టీడీపీ నాయకులు గానీ మా అభ్యర్థుల నామినేషన్లను అడ్డుకోవాలని చూస్తే సహించే ప్రసక్తే లేదు. అలాంటి అక్రమాలు జరిగితే, వెంటనే మా ఎమ్మెల్యే మరియు ఆదిత్య రెడ్డి నేతృత్వంలో ఆయా మండలాల్లోని పోలీస్ స్టేషన్ల ఎదుట బైఠాయించి పెద్ద ఎత్తున ఆందోళనలు,ధర్నాలు నిర్వహిస్తాం”అని గోవిందరెడ్డి హెచ్చరించారు.

“ప్రశాంత ఎన్నికలే మా ఆకాంక్ష.. అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి”

గ్రామ స్వరాజ్యానికి ప్రతీకలైన పంచాయతీ ఎన్నికలు ఎలాంటి దౌర్జన్యాలు,అవాంఛనీయ సంఘటనలు లేకుండా అత్యంత సజావుగా,ప్రశాంత వాతావరణంలో జరగాలని గోవిందరెడ్డి ఆకాంక్షించారు. ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితులు కల్పించాలని ఆయన కోరారు.”అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా కాకుండా, రాజ్యాంగబద్ధంగా, నిష్పక్షపాతంగా తమ విధులు నిర్వర్తించాలి.రేపు జరగబోయే పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా,సజావుగా జరిగి ప్రజా తీర్పు వెలువడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము” అని ఆయన పేర్కొన్నారు.ఈ విలేకరుల సమావేశంలో పార్టీ ముఖ్య నాయకులు రమణారెడ్డి,మున్నెల్లి ప్రభాకర్ రెడ్డిలతో పాటు పోరుమామిళ్ల మండల పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని గోవిందరెడ్డి వ్యాఖ్యలకు మద్దతు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.