టికెట్ పేరుతో కోట్ల దందా.కాంట్రాక్టర్లకు ప్రజాసేవ ఏం తెలుసు? సర్పంచ్ ఎన్నికలను అడ్డుకుంటే పోలీస్ స్టేషన్ల వద్దే ఎమ్మెల్యేతో కలిసి ధర్నా: గోవిందరెడ్డి సంచలన హెచ్చరిక

పోరుమామిళ్ల (కడప జిల్లా) నవంబర్ 11 ప్రజావాణి స్థానిక సంస్థల ఎన్నికల సమరం వేడెక్కుతున్న తరుణంలో బద్వేలు నియోజకవర్గ రాజకీయాల్లో పెను దుమారం రేగింది. కడప జిల్లా పోరుమామిళ్ల మండలంలోని తన నివాసంలో,పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక విలేకరుల సమావేశంలో గోవిందరెడ్డి అధికార పార్టీ తీరుపై నిప్పులు చెరిగారు.ముఖ్యంగా బద్వేలు టీడీపీ ఇన్‌ఛార్జి సూర్యనారాయణ రెడ్డి లక్ష్యంగా ఆయన చేసిన సంచలన ఆరోపణలు నియోజకవర్గ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. "ప్రజాస్వామ్యాన్ని వ్యాపారంగా మార్చారు" ఇటీవల ముగిసిన ఎంపీటీసీ,జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ బద్వేలు ఇన్‌ఛార్జి...