ఆదర్శంగా నిలుస్తున్న కాంగ్రెస్ యువ నాయకులు విజయ్ కుమార్
గ్రామపంచాయతీ పరిశుద్య కార్మికులకు యువజన నాయకులు దీపావళి పండుగ సందర్భంగా శాలువతో ఘనంగా సన్మానం..
మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి నవంబర్ 11
గ్రామ పరిశుద్యంలో కీలకపాత్ర వహిస్తున్న గ్రామపంచాయతీ పరిశుద్య కార్మికులకు, దీపావళి పండుగ సందర్భంగా జుక్కల్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువ బొంపెల్లి వార్ యువజన నాయకులు విజయ్ కుమార్ శాలువాలతో సన్మానించి
తన ఉదరతను చాటుకున్నారు.. తమ శ్రీ లక్ష్మీ మెడికల్ అండ్ జనరల్ స్టోర్ లో మంగళవారం సాయంత్రం లక్ష్మీ పూజ సందర్భంగా ఆయన జుక్కల్ గ్రామ పంచాయతీకి చెందిన పరిశుద్య కార్మికులందరికీ శాలువాతో సన్మానించి మిఠాయిలు పంపిణీ చేశారు.. గ్రామపంచాయతీ కార్మికులు తమ ఆరోగ్యాలను సైతం లెక్క చేయకుండా, గ్రామం పరిశుద్ధంగా ఉండాలని గ్రామస్తులు ఆరోగ్యంగా ఉండాలని, ఉదయం నుండి విధులు నిర్వహిస్తూ గ్రామంలో ఉన్న చెత్త చెదరాన్ని తొలగిస్తూ తమ వంతు కర్తవ్యం నిర్వహించడం జరుగుతుందని ఆయన అన్నారు… ఈ సందర్భంగా పంచాయతీ కార్మికులు సైతం యువ నాయకునికి కృతజ్ఞతలు తెలియజేశారు..

