📄 ePaper
Epaper 2
Tuesday, November 10, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణజానకి నగర్‌లో బీఆర్ఎస్‌లోకి వందమంది చేరికలు అంటూ ప్రచారం

జానకి నగర్‌లో బీఆర్ఎస్‌లోకి వందమంది చేరికలు అంటూ ప్రచారం

📰 Generate e-Paper Clip

జానకి నగర్‌లో బీఆర్ఎస్‌లోకి వందమంది చేరికలు అంటూ ప్రచారం.. గతంలోనూ వారంతా బీఆర్ఎస్‌లో ఉన్నవారే!
కాంగ్రెస్ అభివృద్ధిని చూసి ఓర్వలేకే బీఆర్ఎస్ నాయకుల హడావుడి: భార్మవత్ రాజేష్ నాయక్
చిలుకూరు, మండల ప్రజావాణి న్యూస్:
సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం జానకి నగర్ గ్రామంలో నిన్న రాత్రి మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ సమక్షంలో సుమారు 30 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు ఆ పార్టీ నాయకులు ప్రచారం చేసుకుంటున్నారని చిలుకూరు మండల కాంగ్రెస్ ఎస్టీ సెల్ నాయకులు భార్మవత్ రాజేష్ నాయక్ విమర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిన్న రాత్రి బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో చాలామంది గతంలోనే ఆ పార్టీ సభ్యత్వం తీసుకొని, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నవారేనని పేర్కొన్నారు. జానకి నగర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలహీనపడటంతో తమ పార్టీ ఉనికిని చాటుకునేందుకు ఇలాంటి చేరికల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే గ్రామానికి అభివృద్ధి పనులు:
గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జానకి నగర్ గ్రామంలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో, కొడాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి, రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో గ్రామంలో అనేక అభివృద్ధి పనులకు నిధులు మంజూరయ్యాయని తెలిపారు.
గ్రామానికి మూడు బీటీ రోడ్ల మంజూరుతో పాటు డ్రైనేజీలు, సీసీ రోడ్లు, గ్రామ పంచాయతీ భవనం, వీవో భవనం, బోర్లు, మోటార్ల వంటి పలు అభివృద్ధి పనులకు నిధులు కేటాయించడం జరిగిందన్నారు.
అదేవిధంగా అర్హులైన పేదలకు 8 నుంచి 10 వరకు ఇందిరమ్మ ఇళ్లు, కొత్త ఆసరా పింఛన్లు, రేషన్ కార్డుల మంజూరుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
పదేళ్లలో జరగని అభివృద్ధి.. కాంగ్రెస్ ప్రభుత్వంలో ముందడుగు!
ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాభివృద్ధికి కృషి చేస్తోందని, కేవలం రాజకీయ ఉనికి కోసం జరిగే చేరికల ప్రచారాన్ని చూసి ప్రజలు వాస్తవాలను గుర్తించాలని భార్మవత్ రాజేష్ నాయక్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జానకి నగర్ గ్రామ సర్పంచ్ అనూష, భట్టు అమృ నాయక్,భానోతు రవి, గున్న, పవన్, నాగు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.