జానకి నగర్‌లో బీఆర్ఎస్‌లోకి వందమంది చేరికలు అంటూ ప్రచారం

జానకి నగర్‌లో బీఆర్ఎస్‌లోకి వందమంది చేరికలు అంటూ ప్రచారం.. గతంలోనూ వారంతా బీఆర్ఎస్‌లో ఉన్నవారే! కాంగ్రెస్ అభివృద్ధిని చూసి ఓర్వలేకే బీఆర్ఎస్ నాయకుల హడావుడి: భార్మవత్ రాజేష్ నాయక్ చిలుకూరు, మండల ప్రజావాణి న్యూస్: సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం జానకి నగర్ గ్రామంలో నిన్న రాత్రి మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ సమక్షంలో సుమారు 30 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు ఆ పార్టీ నాయకులు ప్రచారం చేసుకుంటున్నారని చిలుకూరు మండల కాంగ్రెస్ ఎస్టీ సెల్ నాయకులు భార్మవత్ రాజేష్ నాయక్...