*చిలిపిచెడ్ లో ఘనంగా రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు*
*చిలిపిచెడ్, నవంబర్ 8 (ప్రజావాణి):*
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండల కేంద్రంలో ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు.
చిలిపిచెడ్ మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎస్. నారాయణరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి, కాంగ్రెస్ పార్టీ కార్యక ర్తలు స్వీట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎస్. నారాయణరెడ్డి మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రాన్ని ప్రగతిపథంలో ముందుకు తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా ఆయనపై ఉండాలని, ఆయురారోగ్యాలతో ప్రజలకు మరింత కాలం సేవలు అందించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో విశ్వాంబర స్వామి, దుర్గాచలం, పండరి, నగేష్, శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, శ్రీశైలం, గోపాల్, పాపయ్య, మల్లేశం, అంజిరెడ్డి, వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

