📄 ePaper
Epaper 2
Tuesday, November 10, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణనర్సానగర్ గ్రామ పరిధిలో యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య

నర్సానగర్ గ్రామ పరిధిలో యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య

📰 Generate e-Paper Clip

నర్సానగర్ గ్రామ పరిధిలో యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య

నవంబర్ 8 ప్రజావాణి న్యూస్/సంగెం

వరంగల్ జిల్లా సంగెం మండలం నర్సానగర్ గ్రామ పరిధిలోని జాటోత్ తండాలో 07-11-2026 రోజున లావుడ్య వెంకన్న (35 సంవత్సరాలు) అనే వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే, దుగ్గొండి మండలం అడవి రంగాపురం గ్రామ పరిధిలోని గోబ్రియా తండాకు చెందిన లావుడ్య వెంకన్నకు సుమారు 7 సంవత్సరాల క్రితం సంగెం మండలం జాటోత్ తండాకు చెందిన జాటోత్ అఖిలతో వివాహం జరిగింది. వివాహం అనంతరం వెంకన్న అత్తవారి గ్రామమైన జాటోత్ తండాలో ఇల్లరికం ఉంటూ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వీరికి నాలుగు సంవత్సరాల కుమారుడు ఉన్నాడు.
తేదీ 07-11-2026 రోజున ఉదయం సుమారు 11:30 గంటల సమయంలో వెంకన్న తన భార్యతో గొడవ పడిన అనంతరం వారి రేకుల ఇంట్లో ఇనుప పైపుకు తాడుతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.
ఈ విషయం తెలుసుకున్న మృతుడి తల్లి లావుడ్య బీది (60 సంవత్సరాలు) సంఘటనా స్థలానికి చేరుకొని, అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.