📄 ePaper
Epaper 2
Wednesday, November 4, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSiddipet*కేసీఆర్ ను కలిసిన బీఆర్ఎస్ నేతలు*   *ఆప్యాయంగా...

*కేసీఆర్ ను కలిసిన బీఆర్ఎస్ నేతలు*   *ఆప్యాయంగా పలకరించిన కేసీఆర్!* *వ్యవసాయ పనుల నుంచి రాజకీయ పరిణామాల వరకు ఆరా* *పాత పరిచయాలను గుర్తు చేసుకుని ఆత్మీయ సంభాషణ*

📰 Generate e-Paper Clip

నంగునూరు, నవంబరు 3 :నంగునూరు మండలానికి చెందిన సీనియర్ బీఆర్ఎస్ నాయకులు మంగళవారం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ వారిని ఆప్యాయంగా పలకరించారు. వ్యవసాయ పనులు ఎలా సాగుతున్నాయి?” అంటూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆప్యాయంగా పలకరించడంతో ఆ ఇద్దరు నాయకుల భేటీ ఆత్మీయ వాతావరణంలో సాగింది. చాలాకాలం తర్వాత కలుసుకున్న ఆప్తులను పలకరించినట్లుగా కేసీఆర్ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.సిద్ధిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు వేముల వెంకటరెడ్డి, నంగునూరు మాజీ ఎంపీపీ, మాజీ జడ్పీటీసీ సభ్యుడు దువ్వల మల్లయ్య యాదవ్ మంగళవారం ఎర్రవల్లిలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ వారిని పేరుపేరునా ఆప్యాయంగా పలకరిస్తూ, కుటుంబ యోగక్షేమాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.ముఖ్యంగా వ్యవసాయ పనులు ఎలా సాగుతున్నాయి? రైతుల పరిస్థితి ఎలా ఉంది? గ్రామాల్లో ప్రజల జీవన పరిస్థితులు ఎలా ఉన్నాయి? అనే అంశాలపై ఆసక్తిగా ఆరా తీశారు. అనంతరం రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న ప్రస్తుత రాజకీయ పరిణామాలు, క్షేత్రస్థాయిలో రాజకీయ పరిస్థితులు, ప్రజల్లో నెలకొన్న అభిప్రాయాల గురించి వారితో మాట్లాడినట్లు తెలిసింది. ప్రస్తుత ప్రభుత్వ పనితీరుపై ప్రజల స్పందన ఎలా ఉంది? ప్రభుత్వ నిర్ణయాలపై గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి చర్చ జరుగుతోంది? ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలేమిటి? పార్టీ శ్రేణుల పరిస్థితి ఎలా ఉంది? తదితర అంశాలపై కేసీఆర్ వివరాలు తెలుసుకున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా వేముల వెంకటరెడ్డి, దువ్వల మల్లయ్య యాదవ్ స్థానిక పరిస్థితులు, ప్రజల సమస్యలు, రాజకీయ పరిణామాలకు సంబంధించిన వివరాలను కేసీఆర్‌కు వివరించారు. వ్యవసాయ రంగం, రైతుల సమస్యలు, గ్రామీణ ప్రాంతాల పరిస్థితులపై కూడా చర్చ జరిగినట్లు తెలిసింది. మొత్తంగా ఈ భేటీలో రాజకీయ అంశాలతో పాటు వ్యవసాయ, గ్రామీణ సామాజిక పరిస్థితులకు ప్రాధాన్యత లభించింది. కేసీఆర్ తో ఆత్మీయ సంభాషణ ఈ సమావేశంలో ప్రత్యేకంగా నిలిచింది.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.