*కేసీఆర్ ను కలిసిన బీఆర్ఎస్ నేతలు*   *ఆప్యాయంగా పలకరించిన కేసీఆర్!* *వ్యవసాయ పనుల నుంచి రాజకీయ పరిణామాల వరకు ఆరా* *పాత పరిచయాలను గుర్తు చేసుకుని ఆత్మీయ సంభాషణ*

నంగునూరు, నవంబరు 3 :నంగునూరు మండలానికి చెందిన సీనియర్ బీఆర్ఎస్ నాయకులు మంగళవారం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ వారిని ఆప్యాయంగా పలకరించారు. వ్యవసాయ పనులు ఎలా సాగుతున్నాయి?” అంటూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆప్యాయంగా పలకరించడంతో ఆ ఇద్దరు నాయకుల భేటీ ఆత్మీయ వాతావరణంలో సాగింది. చాలాకాలం తర్వాత కలుసుకున్న ఆప్తులను పలకరించినట్లుగా కేసీఆర్ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.సిద్ధిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ...