📄 ePaper
Epaper 2
Wednesday, November 4, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఆరుట్లలో రూ.50 లక్షలతో డబుల్ సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం

ఆరుట్లలో రూ.50 లక్షలతో డబుల్ సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం

📰 Generate e-Paper Clip

*ఆరుట్లలో రూ.50 లక్షలతో డబుల్ సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం*

*ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి సహకారంతో హెచ్‌ఎండీఏ నిధుల మంజూరు*

*పనులను ప్రారంభించిన వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ వెదిరె హన్మంత్ రెడ్డి, సర్పంచ్ మానిపాటి శోభాకుమార్*

రంగారెడ్డి జిల్లా మంచాల, నవంబర్ 4 (ప్రజావాణి):

మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి సహకారంతో హెచ్‌ఎండీఏ నిధుల నుంచి మంజూరైన రూ.50 లక్షలతో డబుల్ సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. గ్రామంలోని ఈదమ్మ గుడి నుంచి కంఠమహేశ్వర దేవాలయం వరకు చేపట్టనున్న రోడ్డు నిర్మాణ పనులను మంచాల వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ వెదిరె హన్మంత్ రెడ్డి, గ్రామ సర్పంచ్ మానిపాటి శోభాకుమార్ కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు.

ఈ సందర్భంగా వెదిరె హన్మంత్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో ఏ పార్టీకి చెందిన సర్పంచ్‌లు ఉన్నా, గ్రామాల అభివృద్ధి కోసం అందరితో కలిసి పనిచేస్తామని తెలిపారు. ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి సహకారంతో గ్రామాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించి అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని అన్నారు. పార్టీలకు అతీతంగా గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకొని అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయిస్తున్నారని పేర్కొన్నారు.

అనంతరం గ్రామ సర్పంచ్ మానిపాటి శోభాకుమార్ మాట్లాడుతూ ఆరుట్ల గ్రామ ప్రజల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడంతో పాటు ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తానని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఆరుట్ల మాజీ సర్పంచ్ కొంగర విష్ణువర్ధన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ డైరెక్టర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.