📄 ePaper
Epaper 2
Wednesday, November 4, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఆటో డ్రైవర్ తాళ్ల శ్రీనివాస్ మృతికి సంతాపంగా ఆటోల బంద్‌కు పిలుపు

ఆటో డ్రైవర్ తాళ్ల శ్రీనివాస్ మృతికి సంతాపంగా ఆటోల బంద్‌కు పిలుపు

📰 Generate e-Paper Clip

ఆటో డ్రైవర్ తాళ్ల శ్రీనివాస్ మృతికి సంతాపంగా ఆటోల బంద్‌కు పిలుపు

హసన్‌పర్తి, నవంబర్ 4, (మన ప్రజావాణి):

హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలంలోని హసన్‌పర్తి గ్రామానికి చెందిన తోటి ఆటో డ్రైవర్ తాళ్ల శ్రీనివాస్ ఈరోజు (04-11-2026) మృతి చెందడం పట్ల హసన్‌పర్తి మన తెలంగాణ ఆటో యూనియన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

ఈ సందర్భంగా ఆయన మృతికి సంతాప సూచకంగా ఈరోజు ఆటోల బంద్ పాటించాలని యూనియన్ నాయకులు పిలుపునిచ్చారు. హసన్‌పర్తి మండలంలోని ఆటో డ్రైవర్లందరూ బంద్‌కు సహకరించి, తోటి డ్రైవర్‌కు నివాళులర్పించాలని కోరారు.

మృతుడి కుటుంబ సభ్యులకు యూనియన్ నాయకులు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.