అమీన్పూర్‌లో డ్రగ్స్ కలకలం.. ఇద్దరు అరెస్ట్!
10.50 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం.. రూ.1.26 లక్షల విలువైన మత్తు పదార్థాలు పట్టివేత
బెంగళూరుకు చెందిన సలోజ్ నుంచి కొనుగోలు చేసినట్లు విచారణలో వెల్లడి
పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం పోలీసుల గాలింపు
అమీన్పూర్, నవంబర్ 1 (ప్రజావాణి):అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మత్తు పదార్థాల అక్రమ రవాణాపై పోలీసులు దాడులు నిర్వహించి ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. బీరంగూడ సోమవారం మార్కెట్ బస్‌స్టాప్ సమీపంలో అక్టోబర్ 31న విశ్వసనీయ సమాచారంతో దాడి చేసిన పోలీసులు హృతిక్ డి. పాటిల్ (26), సిద్ధార్థ్ (25)లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 10.50 గ్రాముల ఎండీఎంఏ,రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన మత్తు పదార్థాల విలువ సుమారు రూ.1.26 లక్షలుగా పోలీసులు వెల్లడించారు.
ప్రాథమిక విచారణలో నిందితులు బెంగళూరుకు చెందిన సలోజ్ వద్ద ఎండీఎంఏ కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. పరారీలో ఉన్న సలోజ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనపై అమీన్పూర్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 787/2026తో ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేశారు. అరెస్టయిన ఇద్దరినీ న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ఈ కేసును అమీన్పూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ మండడి ప్రవీణ్ రెడ్డి దర్యాప్తు చేస్తున్నారు. మాదకద్రవ్యాల నిర్మూలనకు సైబరాబాద్ పోలీసులు కట్టుబడి ఉన్నారని స్పష్టం చేశారు.

