📄 ePaper
Epaper 2
Wednesday, November 4, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఅప్పన్నపేట జడ్పీ పాఠశాలకు 50 బెంచీల వితరణ

అప్పన్నపేట జడ్పీ పాఠశాలకు 50 బెంచీల వితరణ

📰 Generate e-Paper Clip

అప్పన్నపేట జడ్పీ పాఠశాలకు 50 బెంచీల వితరణ

విద్యార్థుల సౌకర్యార్థం ఎంకే ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందజేత

ప్రజావాణి జిల్లా ప్రతినిధి
పెద్దపల్లి: నవంబర్ 04

పెద్దపల్లి మండలం అప్పన్నపేట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ఎంకే ఫౌండేషన్ ఆధ్వర్యంలో 50 బెంచీలను వితరణ చేశారు. ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ఎమ్మెల్సీ మల్క కొమరయ్య తన సొంత పాఠశాలపై ఉన్న మమకారంతో విద్యార్థులకు అవసరమైన బెంచీలను సమకూర్చారు. పాఠశాలలో విద్యార్థులు కూర్చోవడానికి సరైన సౌకర్యాలు లేవని తెలుసుకున్న ఆయన వెంటనే స్పందించి బెంచీలను అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మల్క కొమరయ్య మాట్లాడుతూ.. తాను పదో తరగతి వరకు ఇదే పాఠశాలలో విద్యాభ్యాసం చేశానని గుర్తుచేసుకున్నారు. బంధంపల్లి గ్రామం నుంచి ప్రతిరోజూ ఐదు కిలోమీటర్లు నడిచి వచ్చి చదువుకున్న రోజులను స్మరించుకున్నారు. తనకు విద్యాబుద్ధులు నేర్పి ఉన్నత స్థాయికి చేరుకునేలా పునాది వేసిన పాఠశాల అభివృద్ధికి తన వంతు సహకారం అందించడం బాధ్యతగా భావిస్తున్నానని పేర్కొన్నారు.

గతంలోనూ పాఠశాల అభివృద్ధిలో భాగంగా ఆర్చ్, గేటును ఏర్పాటు చేయించినట్లు తెలిపారు. విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణంతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఎంకే ఫౌండేషన్ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని అన్నారు.

తమ పాఠశాలలో చదువుకుని ఉన్నత స్థాయికి ఎదిగిన మల్క కొమరయ్య తిరిగి అదే పాఠశాల అభివృద్ధికి తోడ్పాటు అందించడం అభినందనీయమని పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. 50 బెంచీలను అందించిన ఎంకే ఫౌండేషన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.