📄 ePaper
Epaper 2
Tuesday, November 10, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఅక్రెడిటేషన్ కార్డుల జారీలో అక్రమాలకు తావులేదు

అక్రెడిటేషన్ కార్డుల జారీలో అక్రమాలకు తావులేదు

📰 Generate e-Paper Clip

*అక్రెడిటేషన్ కార్డుల జారీలో అక్రమాలకు తావులేదు!*

*అర్హత, నిబంధనల ఆధారంగానే కార్డుల మంజూరు.. నిబంధనలు అతిక్రమిస్తే రద్దు తప్పదు: కలెక్టర్ భవేష్ మిశ్రా*

నిర్మల్ జిల్లా ప్రజావాణి బ్యూరో, నవంబర్ 10:–
జిల్లాలో జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియను ఎలాంటి అవకతవకలకు తావులేకుండా, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా స్పష్టం చేశారు. అర్హతలు లేకుండా లేదా నిబంధనలకు విరుద్ధంగా అక్రెడిటేషన్ కార్డులు పొందేందుకు ప్రయత్నించినా, ఇప్పటికే కార్డులు పొందిన వారు వాటిని దుర్వినియోగం చేసినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
మంగళవారం నిర్మల్ కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో జిల్లా అక్రెడిటేషన్ కమిటీ మూడో విడత సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వివిధ జర్నలిస్టుల నుంచి అందిన దరఖాస్తులను కమిటీ పరిశీలించింది. ప్రభుత్వ నిబంధనలు, అర్హత ప్రమాణాలు, దరఖాస్తుదారుల వివరాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో మీడియా పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో జర్నలిస్టులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. జర్నలిజం వృత్తిలో నిబద్ధత, పారదర్శకత, సామాజిక బాధ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అక్రెడిటేషన్ నిబంధనల ప్రకారం దినపత్రికల ప్రచురణ, జర్నలిస్టుల హాజరు తదితర వివరాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా కార్డులు పొందినట్లు విచారణలో తేలితే వాటిని రద్దు చేస్తామని తెలిపారు. అదేవిధంగా అక్రెడిటేషన్ కార్డులను వ్యక్తిగత ప్రయోజనాలకు లేదా ఇతర అనుచిత కార్యకలాపాలకు వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో అక్రెడిటేషన్ కమిటీ కన్వీనర్, డీపీఆర్ఓ ఇ. విష్ణువర్ధన్, కమిటీ సభ్యులు అల్వాల హనుమంతు, రవీందర్, మహేష్, రాజేశ్వర్, అశోక్, నాగరాజు, వసీం షకీల్ , ప్రేమ్ తదితరులు, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.