అక్రెడిటేషన్ కార్డుల జారీలో అక్రమాలకు తావులేదు
*అక్రెడిటేషన్ కార్డుల జారీలో అక్రమాలకు తావులేదు!* *అర్హత, నిబంధనల ఆధారంగానే కార్డుల మంజూరు.. నిబంధనలు అతిక్రమిస్తే రద్దు తప్పదు: కలెక్టర్ భవేష్ మిశ్రా* నిర్మల్ జిల్లా ప్రజావాణి బ్యూరో, నవంబర్ 10:– జిల్లాలో జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియను ఎలాంటి అవకతవకలకు తావులేకుండా, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా స్పష్టం చేశారు. అర్హతలు లేకుండా లేదా నిబంధనలకు విరుద్ధంగా అక్రెడిటేషన్ కార్డులు పొందేందుకు ప్రయత్నించినా, ఇప్పటికే కార్డులు పొందిన వారు వాటిని దుర్వినియోగం చేసినా ఉపేక్షించేది...