వల్బాపూర్ గ్రామం శ్రీ పశుపతినాథ్ శివాలయంలో ఆకాశదీపం ప్రారంభం
ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్:-
ఎల్కతుర్తి మండలం వల్బాపూర్ గ్రామం శ్రీ పశుపతినాథ్ దేవస్థానంలో కార్తీకమాస ప్రారంభోత్సవం సందర్భంగా ఆకాశదీప కార్యక్రమాన్ని ప్రారంభించారు.కార్తీకమాసం నెలరోజుల పాటు ప్రతిరోజూ సాయంకాలం నిర్వహించే ఆకాశదీప కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని స్వామివారి సంపూర్ణ అనుగ్రహానికి పాత్రులు కావాలని ఆలయ అర్చకులు శివశ్రీ సదానిరంజన్ సిద్ధాంతి కోరారు.కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ గంజి భవనరుషి, రాకేష్ అశోక్ విజయశ్రీ కమిటీ సభ్యులు,భక్తులు తదితరులు పాల్గొన్నారు.

