📄 ePaper
5pm
7pm
Thursday, November 19, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeఆంధ్రప్రదేశ్తాడివారిపల్లి ఘాట్ రోడ్డులో మెడిసిన్స్ వాహనం బోల్తా.తృటిలో తప్పిన పెను ప్రమాదం

తాడివారిపల్లి ఘాట్ రోడ్డులో మెడిసిన్స్ వాహనం బోల్తా.తృటిలో తప్పిన పెను ప్రమాదం

📰 Generate e-Paper Clip

తాడివారిపల్లి ఘాట్ రోడ్డులో మెడిసిన్స్ వాహనం బోల్తా.తృటిలో తప్పిన పెను ప్రమాదం

ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి అక్టోబర్ 31 తర్లపాడు, మoడలం మార్కాపురం జిల్లా

స్టీరింగ్ పనిచేయక మూలమలుపు వద్ద అదుపుతప్పిన వాహనం.. డ్రైవర్, హెల్పర్కు తప్పిన ముప్పు

మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలం తాడివారిపల్లి సమీపంలోని ఒంగోలు-కర్నూలు ప్రధాన రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.ఒంగోలు నుంచి కంభం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి మందులు తరలిస్తున్న వాహనం ఘాట్ రోడ్డులోని ఓ ప్రమాదకరమైన మూలమలుపు వద్ద స్టీరింగ్ పనిచేయక అదుపుతప్పి బోల్తా పడింది.

ఈ ప్రమాదంలో వాహనం పూర్తిగా బోల్తా పడినప్పటికీ డ్రైవర్, హెల్పర్కు ఎలాంటి గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో వారిద్దరూ ఊపిరి పీల్చుకున్నారు.ఘాట్ రోడ్డులోని మూలమలుపు వద్ద స్టీరింగ్ పనిచేయకపోవడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.