📄 ePaper
Epaper 2
Monday, October 19, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణసద్దుల, బతుకమ్మ దసరా వేడుకలను విజయవంతం చేయాలి

సద్దుల, బతుకమ్మ దసరా వేడుకలను విజయవంతం చేయాలి

📰 Generate e-Paper Clip

*సద్దుల, బతుకమ్మ దసరా వేడుకలను విజయవంతం చేయాలి*

*ఏర్పాట్లను పరిశీలించిన ఏరియా జిఎం ఎన్ రాధాకృష్ణ*

* *మన ప్రజావాణి* *మందమర్రి*:-

సింగరేణి ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, పట్టణ, చుట్టుపక్క ప్రాంతాల ప్రజలు సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహించూ సద్దుల బతుకమ్మ, దసరా వేడుకలకు విశేషంగా తరలివచ్చి, వేడుకల్లో పాల్గొని, ఉత్సవాలను ఆనందోత్సవాల మధ్య విజయవంతం చేయాలని ఏరియా జిఎం ఎన్ రాధాకృష్ణ కోరారు. గురువారం పట్టణంలోని సింగరేణి ఉన్నత పాఠశాల మైదానంలో సద్దుల బతుకమ్మ, దసరా ఉత్సవాల ఏర్పాట్లను ఆయన, అధికారులతో కలిసి పరిశీలించారు. మైదానంలో జరుగుతున్న పనులను క్షుణ్ణంగా తనిఖీ చేసి, వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ఈసందర్భంగా జిఎం రాధాకృష్ణ మాట్లాడుతూ, సద్దుల ​బతుకమ్మ పండుగ రోజున మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మైదానం మొత్తాన్ని చదును చేసి, చక్కగా అలంకరించాలని, బతుకమ్మ ప్రాంగణంలో మెరుగైన లైటింగ్ సిస్టమ్, నాణ్యమైన సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని సూచించారు.
త్రాగు ​నీటి వసతితో పాటు ప్రత్యేకంగా బతుకమ్మ కొలను ఏర్పాట్లను సక్రమంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ​అదేవిధంగా దసరా ​ఉత్సవాల్లో పాల్గొనేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన బారికేడ్లు ఏర్పాటు చేయాలని, దసరా పండగ సందర్భంగా నిర్వహించు ​ బాణాసంచా(రాంలీలా) కార్యక్రమాన్ని చూడడానికి వేలాదిమంది రావడం జరుగుతుందని, వెలుగులు నింపే బాణా సంచికలు రంగురంగుల మిరిమీట్లు కొలిపె బాణాసంచికలు నిర్వహించాలని సూచించారు. వెలుగులు నింపే లైటింగ్, సౌండ్ సిస్టమ్‌ తో పాటు భద్రత కోసం సెక్యూరిటీ సిబ్బందిని పటిష్టం చేయాలన్నారు. ​ఆహ్లాదకరమైన సాంస్కృతిక కార్యక్రమాలతో దసరా వేడుకలను వైభవంగా నిర్వహించాలని సూచించారు.
​మైదానం కు సంబంధించిన అధికారులకు బాధ్యతలు అప్పగించి, ఎక్కడా చిన్న లోటుపాట్లు జరగకుండా కార్యక్రమాలను విజయవంతం చేయాలని స్పష్టం చేశారు.​ఈ కార్యక్రమంలో ఏరియా ఎస్ఓటు జిఎం జిఎల్ ప్రసాద్, సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఏఐటియుసి బ్రాంచ్ కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణ, ఏరియా ఇంజనీర్ ఈ అండ్ ఎం
​బాలాజీ భాగవతిజా, పర్సనల్
డీజీఎం సిహెచ్ అశోక్, ఏజీఎం అకౌంట్స్ అధికారి ప్రసాద్, ఏరియా సేఫ్టీ అధికారి
​మురళి, సివిల్ డిజిఎం మదీనా భాష, వర్క్ షాప్ డివై ఎస్సి నరేష్,
ఏరియా సెక్యూరిటీ అధికారి వెంకటేశ్వర్ రెడ్డి, ఏఐటీయూసీ ఏరియా ఉపాధ్యక్షుడు భీమనాధుని సుదర్శన్,నాయకులు సివి రమణ, రాజేశ్వరరావు, సివిల్ సూపర్వైజర్లు పాల్గొన్నారు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.