📄 ePaper
Epaper 2
Sunday, October 25, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణసంక్షేమ సంఘం ఆధ్వర్యంలోనే గ్రామీణ వైద్యులకు సంపూర్ణ భద్రత

సంక్షేమ సంఘం ఆధ్వర్యంలోనే గ్రామీణ వైద్యులకు సంపూర్ణ భద్రత

📰 Generate e-Paper Clip

సంక్షేమ సంఘం ఆధ్వర్యంలోనే గ్రామీణ వైద్యులకు సంపూర్ణ భద్రత

-గ్రామీణ వైద్యులకు పూర్తిస్థాయి శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు అందజేయాలి

-ప్రాథమిక వైద్యం చేసుకునే విధంగా చట్టబద్ధత కల్పించాలి

-ఆర్ఎంపీలపై అధికారుల దాడులను ఆపాలి

-ప్రభుత్వం అనుమతి ఇవ్వకుంటే ఉద్యమం
చేస్తాం

-గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులు పిట్టల

ముదిగొండ అక్టోబర్ 25 ప్రజావాణి

మారుమూల ప్రాంతాలలో పనిచేస్తున్న గ్రామీణ వైద్యుల సమస్యలను పరిష్కరించేందుకే గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘాన్ని స్థాపించడం జరిగిందని సంక్షేమ సంఘం ఆధ్వర్యంలోనే ఆర్ఎంపీలకు సంపూర్ణ భద్రత ఉంటుందని ప్రతి ఒక్క ఆర్ఎంపీ స్వేచ్ఛగా గ్రామాల్లో ప్రాథమిక వైద్యం మాత్రమే చేయాలని గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల అధ్యక్షులు పిట్టల నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం ముదిగొండ మండల పరిధిలోని వనంవారి కిష్టాపురంలో ముదిగొండ మండల ఏడవ మహాసభ జిల్లా అధ్యక్షులు పిట్టల నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామీణ వైద్యులకు పారామెడికల్ బోర్డు ద్వారా శిక్షణ కొరకు బడ్జెట్ విడుదల చేసి కొంతమందికి జిల్లాల వారీగా శిక్షణ ఇచ్చారని ఇంతలోనే రాజశేఖర్ రెడ్డి అకాల మరణం జరిగి శిక్షణ మధ్యలోనే ఆగిపోయింది అన్నారు. నాటినుండి నేటి వరకు ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ గ్రామీణ వైద్యుల శిక్షణ పూర్తిచేసి సర్టిఫికెట్లు అందజేయకపోవడం బాధాకరమన్నారు.ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఆర్ఎంపీలకు పూర్తిస్థాయి శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లను అందజేసి ఆదుకోవాలని కోరారు.ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకొని పూర్తిస్థాయి శిక్షణ ఇచ్చి ప్రభుత్వ పథకాలలో గ్రామీణ వైద్యులను భాగస్వాములను చేస్తే మారుమూల పల్లె ప్రజలకు సైతం మెరుగైన వైద్యం అందుతుందన్నారు.

*ఆర్ఎంపీలు ప్రాథమిక వైద్యం మాత్రమే చేయాలి*

గ్రామాలలో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందిస్తున్న గ్రామీణ వైద్యులు కేవలం ప్రాథమిక వైద్యం మాత్రమే చేయాలని నిబంధనలు అతిక్రమించి ఎలాంటి సీరియస్ కేసులు చేయవద్దని జిల్లా అధ్యక్షులు పిట్టల సూచించారు.ఏదైనా అత్యవసర సమయంలో ప్రాథమిక వైద్యం అందించి తక్షణం సంబంధిత క్వాలిఫైడ్ డాక్టర్ల వద్దకు పంపించాలన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించి ప్రజల మన్నన లలు పొందాలన్నారు.సమావేశానంతరం పలువురు మండల అధ్యక్షులకు శాలువాలతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు నెమలికొండ మణికుమార్,నారపోగు సుదర్శన్, జిల్లా సహాయ కార్యదర్శి పెద్ద భాస్కర్, వట్టికూటి ఉపేందర్, ముదిగొండ మండల అధ్యక్ష కార్యదర్శులు నేరెళ్ల నరసింహారావు,కాంచాని శ్రీనివాస యాదవ్, నాయకులు పి అప్పారావు, వెంకట నరసయ్య, గుంపుల వర్ధన్ రాజు,పి మోహనరావు, బచ్చలకూరి నాగేశ్వరరావు, పిల్లలమర్రి రాజశేఖర్, వెంకటేశ్వరరావు,షేక్ సొందు సాహెబ్,ఎండి ఖలీల్,నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.