📄 ePaper
Epaper 2
Tuesday, October 6, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణRajanna Sircillaవేధింపులను మౌనంగా భరించకండి.. ఎదురించండి

వేధింపులను మౌనంగా భరించకండి.. ఎదురించండి

📰 Generate e-Paper Clip

వేధింపులను మౌనంగా భరించకండి.. ఎదురించండి

ఒక్క ఫోన్ కాల్ చేస్తే రక్షణ కవచంలా షీ టీమ్.

రెండు నెలల్లో ఆకతాయిలపై 4 ఎఫ్‌ఐఆర్‌లు, 5 పెట్టీ కేసులు.

హాట్‌స్పాట్ల వద్ద మఫ్టీలో నిఘా.. మహిళల భద్రతకు భరోసా

జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే

రాజన్న సిరిసిల్ల జిల్లా, ప్రజావాణి

మహిళలు, బాలికలు, విద్యార్థినులు ఎలాంటి వేధింపులకు గురైనా మౌనంగా భరించకుండా నిర్భయంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే సూచించారు. వేధింపులపై ఫిర్యాదు చేస్తే ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.గత రెండు నెలల్లో షీ టీమ్‌కు అందిన ఫిర్యాదుల ఆధారంగా ఆకతాయిలపై 4 ఎఫ్‌ఐఆర్‌లు, 5 పెట్టీ కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. వేధింపులకు పాల్పడుతున్న వారిని గుర్తించి వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించినట్లు పేర్కొన్నారు.

హాట్‌స్పాట్ల వద్ద ప్రత్యేక నిఘా

మహిళలు, విద్యార్థినుల భద్రత కోసం జిల్లాలోని గుర్తించిన హాట్‌స్పాట్ల వద్ద షీ టీమ్ బృందాలు మఫ్టీలో నిఘా కొనసాగిస్తున్నాయని ఎస్పీ తెలిపారు. మహిళలు, విద్యార్థినులను వేధించే ఆకతాయిలను గుర్తించి అదుపులోకి తీసుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

సోషల్ మీడియాలో అప్రమత్తంగా ఉండాలి

అపరిచిత వ్యక్తులతో మహిళలు, విద్యార్థినులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులతో పంచుకోవద్దని, సోషల్ మీడియా ద్వారా పరిచయమయ్యే వ్యక్తుల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.విద్యాసంస్థలు, మహిళలు పనిచేసే ప్రదేశాలు, రద్దీ ప్రాంతాల్లో షీ టీమ్ ఆధ్వర్యంలో ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్, పోక్సో చట్టం, సోషల్ మీడియా మోసాలు, మహిళా చట్టాలు తదితర అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఒక్క ఫోన్ కాల్‌తో రక్షణ

విద్యాసంస్థల్లో, రోడ్లపై లేదా పనిచేసే ప్రదేశాల్లో ఎవరైనా అవహేళనగా మాట్లాడినా, ఉద్దేశపూర్వకంగా వెంబడించినా వెంటనే షీ టీమ్‌కు ఫిర్యాదు చేయాలని ఎస్పీ సూచించారు. షీ టీమ్ నంబర్ 8712656425కు ఫోన్ చేస్తే వెంటనే స్పందించి రక్షణ కల్పిస్తామని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.