ఘట్కేసర్, అక్టోబర్ 9 (ప్రజావాణి):విద్యుత్ లైన్ల అభివృద్ధి పనుల నిమిత్తం శనివారం (అక్టోబర్ 10) నారపల్లి సెక్షన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.
ఉదయం 10 నుంచి 10.30 గంటల వరకు సాయి హిల్స్, పీ అండ్ టీ కాలనీ, శ్రీనివాస నగర్, వినాయక నగర్, సంపూర్ణ కాలనీ మెయిన్ రోడ్, సాయిరాం నగర్ కాలనీ, క్రాంతి కాలనీ, గ్రీన్‌ల్యాండ్స్ కాలనీ, పంచవటి కాలనీ, విహారిక కాలనీ, కాకతీయ నగర్ కాలనీ, ధరణి కాలనీల్లో,
ఉదయం 10.30 నుంచి 11 గంటల వరకు సాయి సందీప్, శ్రీకృష్ణ నగర్, అన్నోజిగూడ పాత గ్రామం, ఎస్ఎల్ఎన్ఎస్ కాలనీ, ఎల్ఐజీ కాలనీ, హనుమాన్ నగర్, ఇందిరా నగర్, సాయి నగర్ కాలనీ, సత్యసాయి హౌసింగ్ కాలనీ, సాయి గణేష్ కాలనీ, సాయి గణేష్ ఎన్క్లేవ్, సుముకేష్ హైట్స్, ఐఫోసిటీ, ప్రేమలతా గ్రాండియర్ తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుంది.
ఉదయం 11 నుంచి 11.30 గంటల వరకు కమలానగర్, సాయి నగర్ ఈస్ట్, ధరణి కాలనీ, బాపూజీ నగర్, అరుణోదయ కాలనీ, ఎస్వీ కాలనీ, పీ అండ్ టీ కాలనీ, వెస్ట్ కమలానగర్, విశ్వం విహార్, సుమా రెసిడెన్సీ, గురు ఎన్క్లేవ్, భగత్‌సింగ్ నగర్, అయోధ్య కాలనీ, ఎస్సీ కాలనీ ప్రాంతాల్లో , స్వర్ణగిరి కాలనీ, పీజీఎస్ కాలనీ, అరుంధతి కాలనీ, సీఎస్వీఆర్ కళాశాల, హిమగిరి కాలనీ, జోడిమెట్ల చౌరస్తా పరిసర ప్రాంతాలతో పాటు రామ్కీ, నీలిమా హాస్పిటల్, వైభవ్ కాలనీ, మినీ సింగపూర్, మోడీ బిల్డర్స్, టులిప్స్ గ్రాండ్ తదితర ప్రాంతాల్లోనూ విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది.
మధ్యాహ్నం 12.30 నుంచి 1 గంట వరకు సింగపూర్ టౌన్‌షిప్‌లోని డీ2, డీ3, డీ4, సీ1, సీ2, సీ3, ఏ24 నుంచి ఏ35 వరకు, ఏ1 నుంచి ఏ6 వరకు, ఏ12 నుంచి ఏ21 వరకు, ఏ36 నుంచి ఏ50 వరకు, సీ4 నుంచి సీ10 బ్లాక్‌లతో పాటు పల్లవి స్కూల్ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు.
విద్యుత్ వినియోగదారులు ఈ సమయాలను గమనించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు తెలిపారు.

