విజయ దశమి వేళ డిసిసి జిల్లా అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ నివాసంలో సందడి..
ఆత్మీయంగా దసరా శుభాకాంక్షలు తెలిపిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు దంపతులు!
మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి అక్టోబర్ 21
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, వారి అర్చన దంపతుల మర్యాదపూర్వక సందర్శన.. డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ కుటుంబానికి దసరా శుభాకాంక్షలు తెలిపారు
విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని దసరా రోజున పండుగ కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ డిసిసి జిల్లా అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ నివాసానికి జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు వారి సతీమణి అర్చన విచ్చేశారు.
ఈ సందర్భంగా ఏలే మల్లికార్జున్ కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించి, వారికి విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. పండుగ సందర్భంగా జరిగిన ఈ ఆత్మీయ కలయిక కుటుంబ సభ్యుల మధ్య సంతోషాన్ని, పరస్పర ఆప్యాయతను ప్రతిబింబించింది.
విజయదశమి పర్వదినం ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి సౌభాగ్యాలు నింపాలని, ప్రతి ఒక్కరూ ఆనందంగా పండుగను జరుపుకోవాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.
విజయదశమి శుభాకాంక్షలతో.. ధర్మం, సత్యం, స్నేహభావం, ఐక్యత ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.

