📄 ePaper
Epaper 2
Wednesday, October 21, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణపుట్టగొడుగుల్లా బెల్టు షాపులు - తాగుబోతుల మారుతున్న పల్లెలు

పుట్టగొడుగుల్లా బెల్టు షాపులు – తాగుబోతుల మారుతున్న పల్లెలు

📰 Generate e-Paper Clip

*పుట్టగొడుగుల్లా బెల్టు షాపులు – తాగుబోతుల మారుతున్న పల్లెలు*

రాయికల్;అక్టోబర్ 21(ప్రజావాణి)

ఒకప్పుడు గ్రామం అంటేనే పచ్చని పొలాలు,సాయంత్రం అయితే రచ్చబండ దగ్గర పెద్దల కబుర్లు, ఆడపిల్లలు నిర్భయంగా తిరిగే ప్రశాంతమైన వాతావరణం ఉండేది. కానీ నేడు ఏ గ్రామంలో చూసినా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రతి కూడలిలో, ప్రతి బస్టాండ్ లో, పొలాల గట్ల మీద, స్కూల్ పక్కన కూడా విచ్చలవిడిగా బెల్టు షాపులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చిన వైన్ షాపు ఒకటైతే, దాని చుట్టూ అక్రమంగా నడుస్తున్న బెల్టు షాపులు పది ఉంటున్నాయి. ఈ బెల్టు షాపుల వల్ల గ్రామాల్లోని యువత, కూలీలు, రైతులు పూర్తిగా తాగుబోతులుగా మారుతున్నారు.ఉదయం 6 గంటలకే పొలం పనికి వెళ్లాల్సిన కూలీ, రైతు ముందుగా బెల్టు షాపు దగ్గరికి వెళ్లి క్వార్టర్ వేసుకుని వెళ్తున్నాడు, మధ్యాహ్నం ఎండకు వచ్చి మళ్ళీ బెల్టు షాపులోనే తాగి పడుకుంటున్నాడు. దీంతో పొలం పనులు జరగడం లేదు, సాయంత్రం సంపాదించిన 500 రూపాయల కూలి డబ్బులో 300 రూపాయలు అక్కడే తాగేసి, మిగిలిన 200 రూపాయలు ఇంటికి తీసుకెళ్తే ఆ ఇంట్లో పిల్లల చదువు ఎలా గడుస్తుంది? ఆ ఇల్లాలి కడుపు ఎలా నిండుతుంది? బెల్టు షాపు యజమానులు ఎంఆర్పీ ధర కంటే 20, 30 రూపాయలు ఎక్కువకు ఉదయం నుండి అర్ధరాత్రి వరకు యథేచ్ఛగా మద్యం అమ్ముతున్నారు. వారికి అండగా కొంతమంది అధికారులు, నాయకులు ఉండడంతో ఎవరూ వారిని ప్రశ్నించే పరిస్థితి లేకుండా పోయిందని గ్రామాలలో చర్చించుకుంటున్నారు.ఈ బెల్టు షాపుల వల్ల గ్రామాల్లో రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోయాయి. తాగి బండి నడిపి యాక్సిడెంట్లు చేసి చనిపోతున్నారు. భార్యాభర్తల మధ్య గొడవలు, తాగి వచ్చి భార్యను కొట్టడం, పిల్లలను బూతులు తిట్టడం రోజూ సాధారణమైపోయింది. స్కూల్ కు వెళ్లే ఆడపిల్లలు ఈ బెల్టు షాపుల ముందు నుండి వెళ్లాలంటే భయపడే పరిస్థితి వచ్చింది, ఎందుకంటే అక్కడే తాగి రోడ్డు మీద పడి ఉండే తాగుబోతులు అసభ్యంగా మాట్లాడుతున్నారు.కాబట్టి ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరవాలి. గ్రామాల్లో విచ్చలవిడిగా ఉన్న బెల్టు షాపులపై ఉక్కుపాదం మోపాలి. ప్రతి గ్రామంలో మహిళా సంఘాలతో, గ్రామ పెద్దలతో కమిటీలు వేసి బెల్టు షాపులను గుర్తించి సీజ్ చేయాలి. బెల్టు షాపు నడిపితే 6 నెలలు జైలు శిక్ష, లైసెన్స్ ఇచ్చిన మెయిన్ షాపును కూడా రద్దు చేస్తామనే కఠినమైన నిబంధన తీసుకురావాలి. అప్పుడే పల్లెలు మళ్ళీ ప్రశాంతంగా ఉంటాయి, యువత చెడుదారి నుండి బయటపడుతుంది, కుటుంబాలు నిలబెడతాయని అభిప్రాయపడుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.