📄 ePaper
Epaper 2
Sunday, October 18, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణగ్రామ పెద్దలకు చీరలు పంపిణీ చేసిన మాజీ సర్పంచ్ రవిశంకర్ కుమార్తె దీవెన

గ్రామ పెద్దలకు చీరలు పంపిణీ చేసిన మాజీ సర్పంచ్ రవిశంకర్ కుమార్తె దీవెన

📰 Generate e-Paper Clip

గ్రామ పెద్దలకు చీరలు పంపిణీ చేసిన మాజీ సర్పంచ్ రవిశంకర్ కుమార్తె దీవెన

• దసరా పండుగ సందర్భంగా పెద్దలకు చీరల పంపిణీ.. దీవెన సేవా గుణంపై గ్రామస్తుల ప్రశంసలు

మన సమగ్ర ప్రజావాణి అక్టోబర్ 18 అల్మాయిపేట్ : జిల్లా ప్రతినిధి

సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం అల్మాయిపేట్ గ్రామంలో దసరా పండుగను పురస్కరించుకొని మాజీ సర్పంచ్ రవిశంకర్ కుమార్తె దీవెన గ్రామంలోని పెద్దమనుషులకు చీరలను పంపిణీ చేశారు. తన తండ్రి రవిశంకర్ అనుసరిస్తున్న సేవా మార్గంలో భాగంగా దీవెన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామంలోని పెద్దమనుషులు దీవెన అందించిన చీరలను ఆప్యాయంగా స్వీకరించి ఆమెను అభినందించారు. చిన్న వయసులోనే సేవా భావంతో ముందుకు రావడం అభినందనీయమని కొనియాడారు. దీవెన భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానాలకు ఎదిగి, ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు.
గ్రామ పెద్దల ఆశీస్సులు అందుకున్న దీవెనను పలువురు అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.