📄 ePaper
Epaper 2
Wednesday, October 7, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణవరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన జుక్కల్ ఎమ్మెల్యే తోట

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన జుక్కల్ ఎమ్మెల్యే తోట

📰 Generate e-Paper Clip

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన జుక్కల్ ఎమ్మెల్యే తోట.

మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి అక్టోబర్ 07

కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని మమ్మదాబాద్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు బుధవారం రోజున ప్రారంభించారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ…. జుక్కల్ మండలంలో యాసంగి వరి ధాన్యం కోతలు ఈతర జిల్లాలలో పోలిస్తే ముందుగానే ప్రారంభమైనవి అని తెలిపారు.. రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా, రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రభుత్వం ప్రకటించిన నిబంధన ప్రకారం అర్హత కలిగిన సన్న రకం ధాన్యాన్నికి క్వింటలకు రూ.. 500 ప్రోత్సాహక బోనస్ అందిస్తున్నట్లు తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.. ప్రభుత్వం ఏ-గ్రేట్ ధాన్యాన్ని క్వింటలకు రూ..2461 కామన్ గ్రేడ్ ధాన్యాన్ని రూ..2,441 చొప్పున కొనుగోలు చేస్తుందని పేర్కొన్నారు.. రైతులు ధాన్యాన్ని శుభ్రం చేసి పోలు లేకుండా, తేమ శాతం 17 శాతంలోపు ఉండేలా సిద్ధం చేసి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. తద్వారా ప్రభుత్వ మద్దతు ధరకు ధాన్యాన్ని విక్రయించుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిసిసి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, సర్పంచ్ శకుంతల బాలు సార్, మండల అధ్యక్షులు రమేష్ దేశాయ్ , యూత్ మండల అధ్యక్షులు సతీష్ పటేల్, గణేష్, గ్రామ పెద్దలు తదితరులు గ్రామస్తులు , రైతులు పాల్గొన్నారు…

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.