📄 ePaper
Epaper 2
Wednesday, October 7, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణనిర్ణీత గడువులోగా ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తి చేయాలి

నిర్ణీత గడువులోగా ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తి చేయాలి

📰 Generate e-Paper Clip

నిర్ణీత గడువులోగా ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తి చేయాలి

రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి, జిల్లా ఎలక్ట్రోరల్ రోల్ అబ్జర్వర్ యోగితా రాణా

*మన ప్రజావాణి*
*మంచిర్యాల జిల్లా*:-

జిల్లాలో చేపట్టిన ఎస్ ఐ ఆర్ ప్రక్రియను ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి, జిల్లా ఎలక్ట్రోరల్ రోల్ అబ్జర్వర్ యోగితా రాణా అన్నారు. బుధవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్లు పి.చంద్రయ్య, వి.రాములు, జిల్లా రెవెన్యూ అధికారి మోతిరామ్, మంచిర్యాల రాజస్వ మండల అధికారి శ్రీనివాసరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చంద్రకళ, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ విలాయత్ అలీ, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధరణి మధుకర్ లతో కలిసి ఎ.ఈ.ఆర్.ఓ.లు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి, జిల్లా ఎలక్ట్రోరల్ రోల్ అబ్జర్వర్ మాట్లాడుతూ ఎస్ఐఆర్-2026 లో భాగంగా జిల్లాలో మ్యాపింగ్ కాని, అనమోలీస్ ఓటర్ల సంబంధిత నోటీసులను పూర్తిగా పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో 3 ఈ.ఆర్.ఓ.లు, 18 ఎ.ఈ.ఆర్.ఓ.లు, అదనంగా కేటాయించబడిన 18 ఎ.ఈ.ఆర్.ఓ.లు ఎస్ ఐ ఆర్ సంబంధిత క్లెయిమ్స్ & అబ్జెక్షన్ ప్రక్రియపై పని చేస్తున్నారని తెలిపారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు 18 సంవత్సరాలు నిండి ఓటు హక్కుకు అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు కలిగి ఉండేలా చర్యలు తీసుకోవాలని, నోటీసులు జారీ అయిన ప్రతి ఒక్కరు సంబంధిత డాక్యుమెంట్లను సమర్పించేలా వారికి అవగాహన కల్పించాలని తెలిపారు. భారత ఎన్నికల సంఘంచే జారీ చేయబడిన 11 డాక్యుమెంట్లలో నుంచి మాత్రమే సంబంధిత ఓటర్లు డాక్యుమెంట్లు సమర్పించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. నిర్ణీత సమయంలోగా క్లెయిమ్స్ & అబ్జెక్షన్ ప్రక్రియను పూర్తి చేయాలని, అవసరం మేరకు కుల ధ్రువీకరణ పత్రాలు నిబంధనలు మేరకు అందజేయడం జరిగిందని, ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లందరూ ఒకే పోలింగ్ కేంద్రంలో ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఫారం 7 ద్వారా అందిన దరఖాస్తులను మరణ ధ్రువీకరణ పత్రం పరిశీలన, సంబంధిత కుటుంబ సభ్యుల ఆమోదం ద్వారా తీసి వేయాలని, అర్హత కలిగిన ఏ ఒక్కరూ కూడా ఓటు హక్కును కోల్పోకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. బూత్ స్థాయి ఏజెంట్లకు అవసరమైన సమాచారాన్ని బూత్ స్థాయి అధికారుల ద్వారా అందించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు
అనంతరం రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి, జిల్లా ఎలక్ట్రోరల్ రోల్ అబ్జర్వర్ యోగితా రాణా జిల్లా అదనపు కలెక్టర్లు, జిల్లా రెవెన్యూ అధికారి, మంచిర్యాల రాజస్వ మండల అధికారి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ లతో కలిసి ఎ ఈ ఆర్ ఓ లు, అదనపు ఎ ఈ ఆర్ ఓ లతో ఎస్ ఐ ఆర్- 2026 ప్రక్రియను ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పూర్తి చేసేందుకు తీసుకోవలసిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. బూత్ స్థాయి అధికారులు ఫారం 7 దరఖాస్తుల పరిశీలన విషయంలో రిజిస్టర్ నిర్వహించి సంబంధిత పూర్తి వివరాలు రిజిస్టర్ లో నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కమ్యూనిటీ సర్టిఫికెట్ నిబంధనలను అనుసరించి త్వరితగతిన జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లందరూ ఒకే పోలింగ్ కేంద్రంలో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. బూత్ స్థాయి అధికారులు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో తరచూ సమావేశాలు ఏర్పాటు చేసి వివరాలు తెలియజేయాలని తెలిపారు అంతకుముందు జిల్లాకు చేరుకున్న విద్యాశాఖ కార్యదర్శి, జిల్లా ఎలక్ట్రోరల్ రోల్ అబ్జర్వర్ యోగితా రాణా, జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు తో కలిసి జైపూర్ మండలం ఇందారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 111, 112 పోలింగ్ కేంద్రాలను సందర్శించి సంబంధిత బూత్ స్థాయి అధికారులను వివరాలు అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.